కోడలిపై మామ అత్యాచారం.. ఆయనకే భార్యవంటూ గెంటేసిన భర్త..

కోడలిపై మామ అత్యాచారం.. ఆయనకే భార్యవంటూ గెంటేసిన భర్త..

ప్రస్తుతం సమాజంలో కొందరు పశువులాగా ప్రవర్తిస్తున్నారు. వావివరుసలు మరచి కోడళ్లు, కూతుర్లు, మనవరాళ్ల వంటి వారిపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. గతంలో కన్న కూమార్తెపై తండ్రే అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలు అనేకం జరిగాయి. అంతేకాక కొడుకు భార్యపై కన్నేసిన మామలకు కొదవే లేదు. అయితే తాజాగా ఓ మామ కోడలిపై కన్నేసి.. కొడుకు ఇంట్లో లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గర్భవతి అనే కనీస మానవ్వం లేకుండా దారుణానికి ఒడిగట్టాడు. తనకు జరిగిన అన్యాయం గురించి భర్తతో చెప్పుకుంటే.. తన తండ్రే భార్యవంటూ బయటకు గెంటేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఏడో నెల గర్బిణి అయిన కోడలిపై మామ (50) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న కోడలిని (23) ఈడ్చుకెళ్లి మామ అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు. తనకు జరిగిన దారుణంపై బాధితురాలు భర్తకు తెలియజేసింది. అతడు జాలి చూపకలేదు కదా..ఆమెనే కొట్టి ఇంట్లో నుంచి గెంటేశాడు. అంతేకాక ఎప్పుడైతే తన తండ్రితో శారీరక సంబంధం ఏర్పడిందో అప్పుడే ఆయనకే భార్య అయ్యాంటూ తెగేసిచెప్పాడు. తాను ఏ తప్పు చేయలేదని భర్తను పదేపదే ప్రాధేయపడినా స్వీకరించడానికి నిరాకరించాడు. దీంతో చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సదరు బాధిత మహిళ తన ఆవేదను వ్యక్తం చేసింది.

తన గౌరవాన్నికాపాడుకోవాడానికి మౌనంగా ఉండిపోయానని, తాను ఏ తప్పు చేయలేదని అనేక సార్ల ఆమె భర్తకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయింది. అందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవైలని నిర్ణయించుకున్నానని బాధితురాలు తెలిపింది. ఇక ఈ ఘటనపై ముజఫర్‌నగర్ స్టేషన్ పోలీస్ అధికారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై ఐసీపీ సెక్షన్ 376, 606, బాధితురాలి భర్తపై సెక్షన్ 323 కింద కేసు నమోదుచేశామని తెలిపారు. నిందితుడ్ని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. మరి.. ఇలాంటి మాన మృగాలకు ఎలాంటి శిక్ష విధించాలి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments