iDreamPost

భర్తకు దూరంగా ఉంటున్న మహిళ.. వేరే వ్యక్తి పరిచయం..చివరకు!

మహిళ విషయంలో కొందరు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వేధింపులకు గురిచేస్తూ నరకం చూపిస్తుంటారు. తాజాగా భర్తంగా దూరంగా ఉంటున్న ఓ మహిళ విషయంలో వేరే వ్యక్తి పరిచయం జీవితాన్నే విషాదంలో నింపింది.

మహిళ విషయంలో కొందరు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వేధింపులకు గురిచేస్తూ నరకం చూపిస్తుంటారు. తాజాగా భర్తంగా దూరంగా ఉంటున్న ఓ మహిళ విషయంలో వేరే వ్యక్తి పరిచయం జీవితాన్నే విషాదంలో నింపింది.

భర్తకు దూరంగా ఉంటున్న మహిళ.. వేరే వ్యక్తి పరిచయం..చివరకు!

ప్రస్తుతం సమాజంలో మానవ రూపంలో ఉన్న మృగాలు ఎక్కువయ్యాయి. అడవుల్లో ఉంటే  జంతువుల కంటే.. దారుణంగా సమాజంలో మనిషి రూపంలో ఉండే కొందరు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మహిళ విషయంలో కొందరు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వేధింపులకు గురిచేస్తూ నరకం చూపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో తమ మాట వినలేదని..హత్య చేసుకుందు కూడా వెనుకాడటం లేదు. తాజాగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళ..తాను అడిగిన దానికి ఒప్పుకోలేదని ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరవునిపల్లి గ్రామంలో కోళ్ల సైదమ్మ(47) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె చాలా కాలం నుంచి భర్తకు దూరంగా ఉంటుంది. ఇదే సమయంలో ఆమె సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేటు స్కూల్ కి చెందిన హాస్టల్ లో వార్డెన్ గా పని చేస్తోంది. అక్కడ పని చేయగా వచ్చిన జీతంతో సైదమ్మ జీవనం సాగిస్తుంది. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కావడంతో ఆమె సొంత ఊరైన బైరవుని పల్లికి వచ్చి ఉంటుంది. ఇక అదే గ్రామానికి చెందిన సొంటి శ్రీను అనే వ్యక్తి..ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని  కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు.

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సైదమ్మ ఇంటికి వెళ్లి గొడపడి.. కొట్టినట్లు సమాచారం. అలానే శుక్రవారం కూడా మరోసారి సైదమ్మ ఇంటికి వెళ్లిన శ్రీను గొడవకు పెట్టుకున్నాడు. పథకం ప్రకారమే ముందుగా తెచ్చుకున్న కత్తితో ఆమెపై మూడు చోట్ల బలంగా పొడిచాడు. అనంతరం సైదమ్మ చేతులను కత్తితో దారుణంగా కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైదమ్మ అపస్మాకరక స్థితిలో రక్తపు మడుగులో పడి పోయింది. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడి తీసుకెళ్లే లోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా నిందితుడు శ్రీను సైతం అదే కత్తితో పొడుచుకోగా పేగులు బయటకు వచ్చాయి.

దీంతో అతడు కూడా అపస్మారక స్థితిలో పడిపోయాడు. అతడిని ఖమ్మం తరలించగా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కోదాడ నుంచి ఊరికి రాకున్న సైదమ్మ బతికేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సైదమ్మ మృతితో  బైరవుని పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలా వివాహేతర సంబంధం, ప్రేమ వ్యవహారాల కారణంగా ఎంతోమంది మహిళలు దారుణ హత్యలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి