iDreamPost

స్నేహితులతో కలిసి భోజనం చేసింది.. కాసేపటికే దారుణం!

జీవితం చాలా విలువైనది. అంతేకాక చాలా అరుదుగా లభించే జన్మ.. మానవ జీవితం అని పెద్దలు చెబుతుంటారు. కానీ అలాంటి అరుదైన జీవితాన్ని కొందరు చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.

జీవితం చాలా విలువైనది. అంతేకాక చాలా అరుదుగా లభించే జన్మ.. మానవ జీవితం అని పెద్దలు చెబుతుంటారు. కానీ అలాంటి అరుదైన జీవితాన్ని కొందరు చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.

స్నేహితులతో కలిసి భోజనం చేసింది.. కాసేపటికే దారుణం!

ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తిట్టారని, ఫ్రెండ్స్ హేళన చేశారని, లవ్ ఫెయిల్యూర్, పరీక్షల్లో తప్పడం.. ఇలా అనేక కారణాలతో యువత ఆత్మహత్య చేసుకుంటుంది. ఎంతో బంగారు భవిష్యత్ ఉంచుకుని కూడా మానసిక ఒత్తిడికి లోనై.. ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలా జరుగుతున్న ఆత్మహత్యలో కొన్ని అనుమానస్పదంగా ఉంటుంది. తాజాగా డిగ్రీ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ఈ ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గంగిపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, జీవిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె సృజన నగునూరు సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో బీఎస్సీ డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది. సృజన అందరితో చాలా కలివిడిగా ఉంది. బుధవారం ఉదయం రాత్రి తరగతి గదిలో ఫ్యాన్స్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కాలేజీ సిబ్బంది మృతురాలి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.

ఇక కాలేజీ సిబ్బంది చెప్పిన సమాచారంతో సృజన తల్లిదండ్రులు హతాశులయ్యారు. వారు గురువారం ఉదయం కళాశాల వద్దకు చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి గుండె పగిలేలా రోధించారు.  ఈ ఘటన గురించి మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ..ఆదివారం ఇంటికి వస్తానంటూ బుధవారమే తమ కుమార్తె ఫోన్‌ చేసిందని, తీసుకెళ్లేందుకు రావాలని కోరిందని తెలిపారు. ఇంతలోనే ఆత్మహత్య చేసుకునేంత ఆపద ఏమొచ్చిందో అర్థం కావడం లేదని సృజన తల్లి సహా కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.

ఇక తన బిడ్డ మృతిపై అనుమానం ఉందంటూ మృతురాలి తండ్రి లక్ష్మీనారాయణ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఇక సృజన మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇక యువతి ఆత్మహత్య ఘటనపై గురుకుల కాలేజీ ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ..రోజువారీగానే సృజన బుధవారం సాయంత్రం స్నేహితులందరితో కలిసి భోజనం చేసిందని తెలిపారు. అనంతరం అందరూ కలిసి తరగతి గదిలో రాత్రి 11 గంటల వరకు చదువుకున్నారు.

ఆ తరువాత నాలుగో అంతస్తులోని వారి గదుల్లోకి వెళ్లి నిద్రించారు. అందరూ నిద్రలో ఉండగా సృజన తిరిగి కింద ఉన్న తరగతి గది వచ్చిందని, అక్కడే ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుందని తెలిపారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చదువుకోవడానికి తరగతి గదికి వచ్చిన తోటి విద్యార్థులు సృజన ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే అధ్యాపకురాలికి సమాచారం ఇచ్చారని కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు. ఇదిలా ఉండగా విద్యార్థి సంఘాల నేతలు, బీఎస్పీ నేతలు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని యువతి మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి