iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో దారుణం.. నడిచి వెళ్తున్న యువతి బట్టలు చింపేశాడు!

హైదరాబాద్ లో దారుణం.. నడిచి వెళ్తున్న యువతి బట్టలు చింపేశాడు!

నేటి సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టింది మొదలు తిరిగి ఇంటికి చేరే వరకు.. భయం భయంగా ఉంటారు. ఇక ఆడపిల్లల తల్లిదండ్రలు భయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ, ఏ మానవ మృగం..తమ బిడ్డకు అపాయం కలిగిస్తోందని ఆందోళనతో ఉంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు మానవ మృగాలకు చట్టాలు అంటే భయం లేక.. పట్టపగలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే మణిపూర్ లో మహిళలను కొందరు నగ్నం చేసిన ఘటన మరువక ముందే హైదరాబాద్ నగరంలో అలాంటి ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జవహార్ నగర్ కు చెందిన పెద్దమారయ్య (30) కూలీగా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసగా మారి.. నిత్యం తాగుతుండే వాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి.. తల్లితో కలిసి బాలాజీ నగర్ బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో అటుగా ఓ యువతి (28) షాపు నుంచి ఇంటి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను చూసిన మారయ్య చేయ్యి వేసి.. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న యువతి..మారయ్యను దూరంగా నెట్టేసింది. దీంతో విచక్షణ కోల్పోయిన మారయ్య.. ఆమెపై దాడి చేశాడు. అంతేకాక అంతటితో ఆగకుండా బలవంతంగా ఆ యువతి దుస్తులు చించేశాడు.

పక్కన ఉన్న మారయ్య తల్లి కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అటుగా బైక్ పై వెళ్తున్న ఓ మహిళ.. అడుకుని ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెపై కూడా  దాడికి ప్రయత్నించాడు. యువతిపై దాడి చేసి..నగ్నంగా రోడ్డుపై ఉంచాడు. ఆమె 15 నిమిషాల పాటు రోడ్డు మీద నగ్నంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆమెపై వస్త్రం వేసి కాపాడే ప్రయత్నం చేయలేదు. మారయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాక ఆమెకు కవర్లు కప్పారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. మరి.. ఇలాంటి మానవ మృగానికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: దారుణం: పెళ్లి చేసుకోమంటే.. ట్యాంకర్ కిందకు తోసి హత్య!

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş