Arjun Suravaram
సంసారంలో గొడవలు అనేవి సర్వసాధారణం. కానీ ఆ గొడవలే ముదిరినప్పుడు పచ్చని సంసారాన్ని నిట్టనిలువును తగలబెట్టేస్తాయి. ఇలానే మద్యం కూడా కుటుంబం అనే నావను నడి సముద్రంలో ముంచుతుంది.
సంసారంలో గొడవలు అనేవి సర్వసాధారణం. కానీ ఆ గొడవలే ముదిరినప్పుడు పచ్చని సంసారాన్ని నిట్టనిలువును తగలబెట్టేస్తాయి. ఇలానే మద్యం కూడా కుటుంబం అనే నావను నడి సముద్రంలో ముంచుతుంది.
Arjun Suravaram
భార్యాభర్తల బంధం అనేది ఎంతో గొప్పది. అందుకే ఎన్నికష్టనష్టాలు వచ్చినా కలిసి జీవిస్తుంటారు ఎంతో మంది దంపతులు. ఇక సంసారంలో గొడవలు అనేవి సర్వసాధారణం. కానీ ఆ గొడవలే ముదిరినప్పుడు పచ్చని సంసారాన్ని నిట్టనిలువును తగలబెట్టేస్తాయి. ఇలానే మద్యం కూడా చక్కని కుటుంబంలో చీకటిని నింపుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ మద్యం కారణంగా దంపతుల్లో ఎవరో ఒకరు హత్యకు, ఆత్మహత్యకు గురయ్యే ఘటనలు కూడా జరిగాయి. తాజాగా ఓ మహిళ.. తన భర్తను చీరతో బిగించి చంపేసింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఆవడి ప్రాంతలోని ఆర్మీ క్వార్టర్స్ లో వేలంకన్నిదాస్(38), లిమా రోజ్నేరీ(36) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అతడు తిరుచ్చికి ప్రాంతంకి చెందిన వ్యక్తిగా..కొన్నేళ్ల క్రితం లిమాను వివాహం చేసుకున్నాడు. ఆయన ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. తరచూ సెలవుల పెట్టుకుని ఇంటికి వస్తుండే వాడు. ఈ క్రమంలోనే ఇటీవల సెలవుల పెట్టుని ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే వేలంకన్ని దాస్ ఈనెల 10వ తేదీ రాత్రి మద్యం మత్తులో పడక గదిలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన అతని భార్య లీమా రోజ్ మేరీ వెంటనే స్థానికుల సహయంతో స్థానికంగా ఉండే ఆర్మీ ఆస్పత్రికి తీసుకెళ్లింది.
అక్కడ దాస్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వేలంకన్ని దాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే అనుమానాస్పద మృతిగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వేలంకన్ని దాస్ మెడపై గాయం ఉన్నట్లు గుర్తించారు. మృతుడి భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న భర్తను తానే గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించింది. తన భర్త రోజూ మద్యం మత్తులో గొడవ పడేవాడని, ఆ హింసను భరించలేక చీరతో గొంతుకు బిగించి చంపేశాని తెలిపింది.
మొత్తంగా అనుమానస్పదంమైన కేసును హత్య కేసుగా మార్చారు. అంతేకాక నిందితురాలు లీమా రోస్‌ను అరెస్టు చేసి పూంతమల్లి కోర్టులో హాజరుపర్చి పుజల్ జైలులో ఉంచారు. అలానే మద్యం కారణంగా కాకుండా వివాహేతర సంబంధాల కారణంగా కూడా హత్యలు చోటుచేసుకుంటున్నాయి. పరాయి వారి మోజులో పడిన భాగస్వామిని, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను కొందరు హతమారుస్తున్నారు. ఇలా అక్రమ సంబంధాలు, మద్యం, జూదం వంటి వాటి కారణంగా సంసారం అనే నావ నడి సముద్రంలో మునిగిపోతుంది. అందుకు ఉదాహరణే తాజాగా తమిళనాడులో జరిగిన ఈ ఘటన. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.