Arjun Suravaram
నేటి కాలంలో మంచి అనే ముసుగు వేసుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిలో మహిళలు కూడా ఉన్నారు. తమ మాయ మాటలతో నమ్మించి.. దారుణమైన పనులు చేస్తున్నారు. తాజాగా బెంగుళూరు ఓ ఘటన చోటుచేసుకుంది.
నేటి కాలంలో మంచి అనే ముసుగు వేసుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిలో మహిళలు కూడా ఉన్నారు. తమ మాయ మాటలతో నమ్మించి.. దారుణమైన పనులు చేస్తున్నారు. తాజాగా బెంగుళూరు ఓ ఘటన చోటుచేసుకుంది.
Arjun Suravaram
ఈ మధ్యకాలంలో మనిషుల మీద నమ్మకం పోతుంది. డబ్బుల కోసం కొందరు మనుషులు చేస్తున్న దారుణలను చూస్తే.. సమాజం ఎటువెళ్తుందా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. అలానే ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. మాయ మాటలు చెబుతూ మంచి అనే ముసుగులో నిండ ముంచేస్తున్నారు. ఇలా వివిధ రకాల నేరాలు చేసే వారిలో కేవలం మగవాళ్లు మాత్రమే కాదు.. ఆడవాళ్లు సైతం ఉన్నారు. కొందరు మహిళలు తమ తియ్యటి మాటలతో ఎదుటి వారిని నమ్మించి… ఆ తరువాత నడి సముద్రంలో ముంచేస్తున్నారు. తాజాగా ఇద్దరు మహిళలు అలాంటి నేరానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నేటికాలంలో సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. ఈ క్రమంలో కొందరు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు చేస్తూ.. అందినకాడికి దోచుకెళ్తున్నారు. అనేక రకాల పద్ధతుల్ల ఈ చోరీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇళ్లలో పని వారిగా చేరి.. యాజమాని పూర్తిగా నమ్మిన తరువాత.. తమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదును చూసుకుని ఇంట్లో ఎవరు లేని సమయంలో సొమ్ము,నగదు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేస్తుంటారు. తాజాగా కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఇద్దరు మహిళలు ఈ తరహా దొంగతనాలు చేస్తున్నారు.
బెంగళూరు నగరంలోని బనశంకరి ప్రాంతంలో మునికృష్ణప్ప అనే పెద్దాయన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన రేడియో కేంద్రంలో డైరెక్టర్ గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన ఇంట్లో నర్సింగ్ అసిస్టెంట్లుగా పని చేసేందుకు కొప్పళ ప్రాంతానికి చెందిన మంజుళ ఉజరత్, కనకపురం ప్రాంతానికి చెందిన మహదేవమ్మల పని మనుషులుగా తీసుకున్నారు. వారు తొలుత తాము ఇళ్లలో పనులు చేస్తామని మునికృష్ణప్పను నమ్మించారు. వారి మాటలను నమ్మని ఆయన నర్సింగ్ అసిస్టెంట్లుగా వారిని నియమించుకున్నారు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఓ రోజు ఆ ఇంట్లో చోరి చేసి భారీగా నగదు, సొమ్మును కాజేసి పరారయ్యారు.
తన ఇంట్లో జరిగిన చోరీపై మునికృష్ణప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు మంగళవారం జేపీ నగర్ పోలీసులు ఆ ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.28 లక్షల విలువ చేసే 414 గ్రాముల బంగారం, 104 గ్రాముల వెండి, 4 విదేశీ వాచ్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మునికృష్ణప్ప ఇంట్లో 31 గ్రాముల బంగారం, 4 వాచ్ లను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇళ్లలో పని మనుషులుగా, రోగులకు సహాయకులుగా చేరి బంగారు నగలను వీరు తస్కరిస్తున్నారు. పలు ఇళ్లలో ఇదే రీతిలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మరి.. కిలేడి మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.