iDreamPost
android-app
ios-app

వీడియో: స్పీకర్‌లో హనుమాన్‌ చాలిసా పెట్టాడని దుకాణదారుడిపై దాడి! ఎక్కడంటే?

హనుమాన్ చాలిసా పెట్టాడని ఓ మొబైల్ షాపు యజమానిపై కొందరు యువకులు దాడి చేశారు. నడ్డి రోడ్డుపై బాధితుడిని ఒక్కడిని చేసి.. దారుణంగా కొట్టారు. నలుగురు కలసి.. ఒక్కడిని కొడుతుంటే..కాపాడేందుకు చుట్టుపక్కల వాళ్లు ఒక్కరు కూడా రాలేదు.

హనుమాన్ చాలిసా పెట్టాడని ఓ మొబైల్ షాపు యజమానిపై కొందరు యువకులు దాడి చేశారు. నడ్డి రోడ్డుపై బాధితుడిని ఒక్కడిని చేసి.. దారుణంగా కొట్టారు. నలుగురు కలసి.. ఒక్కడిని కొడుతుంటే..కాపాడేందుకు చుట్టుపక్కల వాళ్లు ఒక్కరు కూడా రాలేదు.

వీడియో: స్పీకర్‌లో హనుమాన్‌ చాలిసా పెట్టాడని దుకాణదారుడిపై దాడి! ఎక్కడంటే?

ఈ మధ్యకాలంలో కొందరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పబ్లిక్ ప్రదేశాల్లో అల్లరి చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలానే మరికొందరు అయితే ఏదో మనస్సులో దురుద్దేశం పెట్టుకుని దాడులు చేస్తున్నారు. తాజాగా ఓ మొబైల్ దుకాణం యజామానిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ యజమాని తన షాపు ముందు ఉన్న  లౌడ్ స్పీకర్ లో హానుమాన్ చాలిసా పెట్టాడని కొందరు యువకులు తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఆదివారం రాత్రి కర్నాటక రాష్ట్రంలో బెంగళూరు నగరంలోని హలసూరు ప్రాంతంలో ఓ మొబైల్ షాపు యజమాని..తన దుకాణం ముందున్న లౌడ్ స్పీకర్ లో హనుమాన్ చాలిసా పెట్టాడు. అయితే అటుగా వెళ్తున్న కొందరు యువకులు..కు హనాన్ చాలిసా వినిపించడంతో దుకాణం వద్దకు చేరుకున్నారు. ఆ లౌడ్ స్పీకర్ ను ఆప్ చేయామని సదరు షాపు యజమానిని ఆ యువకులు హెచ్చరించారు. అందుకు దుకాణంలో ఉన్న వ్యక్తి నిరాకరించాడు. ఈ క్రమంలో ఆ యువకులు షాపులోని వ్యక్తితో మధ్య వాగ్వాదానికి దిగారు. అయితే షాపులోని వ్యక్తి కూడా ఎక్కడ వెనక్కి తగ్గకపోవడంతో అతనిపై బయట నుంచే యువకులు దాడికి పాల్పడ్డారు. తనను ఎందుకు కొడుతున్నారంటూ దుకాణంలోని వ్యక్తి బయటికి వెళ్లాడు. దీంతో ఆ యువకుల మూక  ఆ వ్యక్తిపై ఒక్కసారిగా విరుచుకుపడింది. రోడ్డుపై పడేసి, కాళ్లతో, చేతులతో తీవ్రంగా కొట్టారు.

 ఇలా ఆ గుంపు కలిసి ఒక్కడిని కొడుతున్నా రోడ్డుపై వెళ్లేవాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. వారి నుంచి ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం ఎవ్వరు చేయలేదు. ఇక ఈ దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొబైల్‌ షాపులోని, అలానే షాపు ముందున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. అలానే షాపు యజమానిపై దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మొత్తంగా ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దాడులకు పాల్పడే వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలనే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఇలా దాడులకు పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.