iDreamPost
android-app
ios-app

ఫేస్ బుక్ లో పరిచయం.. భర్త కువైట్ లో.. ఈ భార్య కథ దారుణం!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి స్నేహాలు చివరకు ప్రేమలకు దారి తీసి...పెళ్లిపీటలు ఎక్కుతున్నాయి. అలానే ఇద్దరు ఫేస్ బుక్ ద్వారా పరిచయమై..ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన ఏడాదిన్నరలోనే వారి కథలో విషాదం చోటుచేసుకుంది.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి స్నేహాలు చివరకు ప్రేమలకు దారి తీసి...పెళ్లిపీటలు ఎక్కుతున్నాయి. అలానే ఇద్దరు ఫేస్ బుక్ ద్వారా పరిచయమై..ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన ఏడాదిన్నరలోనే వారి కథలో విషాదం చోటుచేసుకుంది.

ఫేస్ బుక్ లో పరిచయం.. భర్త కువైట్ లో.. ఈ భార్య కథ దారుణం!

నేటికాలంలో సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి స్నేహాలు చివరకు ప్రేమలకు దారి తీసి…పెళ్లిపీటలు ఎక్కుతున్నాయి. అలానే ఇద్దరు ఫేస్ బుక్ ద్వారా పరిచయమై..ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇక భర్త కువైట్ కి వెళ్లగా.. భార్య అత్తగారింట్లో ఉంటుంది. ఇదే సమయంలో తాజాగా ఆ మహిళ గురించి ఓ వార్త విని ఆమె భర్త షాకయ్యాడు.  ఆంధ్రప్రదేశ్ ని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాంతంలోని వాల్మీకిపురం గ్రామానికి చెందిన అమీర్ జాన్ కుమారుడు వసీమ్ కు పీలేరు చెందిన మల్లెల రెడ్డి బాషా కూతురు అర్షియకు మధ్య ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం ఏర్పడిన  ఆ పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. చివరకు ఆ ఇద్దరు పెద్దల్ని ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లి కంటే ముందు నుంచే వసీం కువైట్‌లో జాబ్ కోసం గట్టి గా  ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అర్షియాతో పెళ్లైన తరువాత కువైట లో ఆఫర్ వచ్చింది. ఆమెను అర్షియను పెళ్లి చేసుకున్న నెలన్నరకే కువైట్ కు వెళ్ళాడు.

ఇక భర్త కువైట్ వెళ్లడంతో అర్షియ వాల్మీకి పురంలోనే అత్తగారింట్లో  ఉంటుంది. పెళ్లైన కొన్ని రోజులు వరకు అత్తగారింట్లో అర్షియకు బాగానే ఉంది. కానీ కొంతకాలం తరువాత అక్కడ అర్షియాకు వేధింపులు ప్రారంభమయ్యాయి. అత్తగారింట్లో జరిగే వేధింపుల గురించి  భర్త వసీంకు చెప్పింది. అయితే.. వసీం దాన్ని పట్టించుకోలేదు.. భర్త తీరుతో అర్షియ మరింత మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే.. అత్తారింట్లో జరుగుతున్న  సంఘటనల గురించి చెప్పేందుకు అర్షియ రెండ్రోజుల క్రితం పీలేరులోని తన పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత తిరిగి వాల్మీకిపురంలోని తన అత్తవారింటికి చేరుకుంది.  వాల్మీకి పురం వెళ్లిన గంటలోపే ఆర్షియ సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. అసలు ఏం జరిగిందే ఆమె తల్లిదండ్రులు కనిపెట్టే లోపే అర్షియ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

అర్షియా ఉరి వేసుకుని మృతి చెందిందని.. వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం ఉందని చెప్పడంతో అర్షియ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే అర్షియ మృతిపై ఆమె తల్లిదండ్రులు ఆఅనుమానాలు వ్యక్తం చేశారు. అత్తారింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్షియ మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించిన ఆధారాలు సేకరించారు. అర్షియా అత్తింటివారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మొత్తంగా ఎంతో గొప్పగా ఊహించుకున్న ఆ యువతి  జీవితం..ఏడాదిన్నరలోనే విషాదంగా ముగిసింది.