P Krishna
Bengaluru Crime News: బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. విదేశీ మహిళ అనుమానాస్పద స్థితిలతో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.
Bengaluru Crime News: బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. విదేశీ మహిళ అనుమానాస్పద స్థితిలతో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.
P Krishna
ఇటీవల దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, లైంగిక వేధింపులు మరీ ఎక్కువ అవుతున్నాయి. ఒంటరిగా కనిపించే మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న వయసు, పెద్ద వయసు అనే తేడా లేకుండా మృగాళ్లాగ రెచ్చిపోయి దారుణాలకు తెగబడుతున్నారు. ఈ మధ్యనే ఝార్ఖండ్ లో కొంతమంది యువకులు విదేశీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పపడిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన మరువక ముందే బెంగుళూరు లో ఓ హోటల్ లో ఉజ్జేకిస్థాన్ కి చెందిన మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించడం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగుళూరు లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టూరిస్ట్ గా వచ్చిన ఉజ్బెకిస్థాన్ కి చెందిన జరీన్ (37) ఓ హూటల్ గదిలో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉజ్బెకిస్థాన్ కి చెందిన జరీన్ అనే మహిళ పర్యాటకురాలు ఈ నెల 5న బెంగుళూరు కు వచ్చింది. శేషాద్రిపురంలోని హూటల్ లో రెండో ఫ్లోర్ లో గది అద్దెకు తీసుకుంది. హటల్ సిబ్బంది ఆమె గదికి వెళ్లి తలుపులు తట్టగా ఎంతకీ స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి మేనేజర్ కి ఫిర్యాదు చేశారు. హూటల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మాస్టర్ కీ ఉపయోగించి లోపలికి వెళ్లి చూడగా జరీన్ మృతదేహం కనిపించింది.
రాహూల్ కుమార్ అనే వ్యక్తి జరీన్ కోసం ఈ నెల 16 వరకు హూటల్ గదిని బుక్ చేశాడు. హూటల్ గదిలో జరీన్ మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ప్లాన్ ప్రకారం చంపి ఉరివేసుకున్నట్లు చిత్రీకరించినట్లుగా అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా డీఎస్పీ శేఖర్ తెలిపారు. హూటల్ గదిలో ఏదో ఘర్షణ జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. జరీనా మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. రిపోర్ట్ వచ్చాక మృతిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని డీఎస్పీ తెలిపారు. హూటల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు డాగ్ స్క్వాడ్ , ఫోరెన్సీక్ లాబొరేటర్ సిబ్బంది హూటల్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆమె హూటల్ కి వచ్చినప్పటి నుంచి ఎవరెవరు కలిశారు? అన్న విషయంపై సీసీ టీవీ ఫుటేజ్, గెస్ట్ రిజిస్ట్రర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.