iDreamPost
android-app
ios-app

ల్యాబ్ టెక్నీషియన్ క్రూరత్వం.. విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి..!

  • Published Dec 13, 2023 | 9:12 AM Updated Updated Dec 13, 2023 | 9:12 AM

ఇటీవల దేశంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. తమవారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు.

ఇటీవల దేశంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. తమవారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు.

ల్యాబ్ టెక్నీషియన్ క్రూరత్వం.. విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి..!

వివాహబంధం ఎంతో పవిత్రమైనది. వేదమంత్రాల సాక్షిగా.. మూడుముళ్ళ బంధంతో ఒక్కటవుతారు జంట. నూరేళ్లూ కలకాలం చల్లగా ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఒక్క ఏడాది కూడా కలిసి జీవించలేకపోతున్నారు దంపతులు. ఆదిపత్య పోరు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు ఇలా పలు కారణాలతో భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. కొంతమంది అక్రమ సంబంధం నేపథ్యంలో ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఎంతోమంది పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. అత్తవారింటిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మూడు సంవత్సరాల క్రితం దర్శన్, శ్వేత (31) వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వివాహ సమయంలో భారీగానే కట్నకానుకలు సమర్పించుకున్నారు శ్వేత తల్లిదండ్రులు. ప్రస్తుతం బెంగుళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు దర్శన్.  భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. నాలుగు రోజుల క్రితం బెంగుళూరు నుంచి చిక్కమగళూరు జిల్లా దేవవృందం కు చేరుకున్నారు దర్శన్, శ్వేత. సోమవారం రాత్రి శ్వేత అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది. అయితే శ్వేతకు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ రావడంతో చనిపోయిందని దర్శన్ అత్తమామలకు సమాచారం అందించాడు. హుటాహుటిన అత్తమామలు శ్వేత అత్తవారింటికి బయలు దేరారు. అప్పటికే దర్శన్.. శ్వేత తల్లిదండ్రులు రాకముందే అంత్యక్రియలు చేయడానికి సిద్దమయ్యాడు.

శ్వేత తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకొని అంత త్వరగా అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీంతో దర్శన్ కుటుంబం సభ్యులు కంగారుపడ్డారు.  శ్వేత తల్లిదండ్రుల అనుమానం వచ్చింది. తమ కూతురుని కావాలనే హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరిస్తున్నారని.. విషపూరిత ఇంజక్షన్ ఇవ్వడం వల్లే తన కూతురు చనిపోయిందని శ్వేత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా దర్శన్ వేరే మహిళతో అక్రమసంబంధం పెట్టుకొని తన కూతురు అడ్డు తొలగించుకునేందుకు పాయిజన్ ఇంజక్షన్ చేసి హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్వేత తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుందని.. నేరం రుజువైతే కఠినంగా శిక్షిస్తామని పోలీస్ అధికారి తెలిపారు.