iDreamPost
android-app
ios-app

అందమైన భార్య.. ఆ చిన్న కారణంతో..

  • Published Mar 28, 2024 | 5:54 PM Updated Updated Mar 28, 2024 | 5:54 PM

Bangalore Crime News: పెళ్లి చేసుకొని భర్తలో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది. కానీ ఆ భర్త ఓ దుర్మార్గుడు అని నమ్మలేకపోయింది.

Bangalore Crime News: పెళ్లి చేసుకొని భర్తలో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది. కానీ ఆ భర్త ఓ దుర్మార్గుడు అని నమ్మలేకపోయింది.

అందమైన భార్య.. ఆ చిన్న కారణంతో..

ఈ మద్య కుటుంబ కలహాలతో ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.   చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా మంది  క్షణికావేశంలో వారు చేసే పనుల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. తమ తప్పు తెలుసుకునే లోపు జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి. ఇలా నిత్యం ఎక్కడో అక్కడ ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.  భర్తతో ఎంతో ఆనందంగా జీవించాలని భావించిన ఓ ఇల్లాలు భర్త తీసుకున్న నిర్ణయం వల్ల ఛిద్రమైంది. ఈ ఘటన బెంగుళూరు రూరల్ లో జరిగింది.  వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలతో హత్య, హత్యలు జరగుతున్న ఉదంతాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. భార్యాభర్తల మధ్య జరిగే గొడవ వల్ల ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, హత్యలకు పాల్పపడటం జరుగుతుంది. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. బెంగుళూరు శివారులోని జిగాని పట్టణంలో దారుణ ఘటన జరిగింది.తన భార్యను చంపి ఆత్మహత్యకు పాల్పపడ్డాడు ఓ భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముబారక్ (28) తన భార్య అర్బియా తాజ్ (24) ని హత్య చేశాడు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు జోక్యం చేసుకొని సర్ధి చెబుతూ వస్తున్నారు.

ఇటీవల అర్బియా తన పుట్టింటికి వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉంది. వెంటనే తన ఇంటికి రావాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భార్య, పుట్టింటి వారికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. కానీ భార్య మాత్రం రానని తేల్చి చెప్పింది. దీంతో ఆమెపై కక్ష్య పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే క్షణికావేశానికి గురైన ముబారక్ తన భార్య అర్బియా ను హత్య చేశాడు. ఇది గమనించిన స్థానికులు ఇంటికి వెళ్లి చూడగా భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు ముబారక్. వెంటనే స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న జిగానీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.