iDreamPost
android-app
ios-app

తల్లిని చంపి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో దాచిన కూతురు!

  • Published Jan 18, 2024 | 6:58 PM Updated Updated Jan 18, 2024 | 6:58 PM

డబ్బుకు లోకం దాసోహం అన్నట్టు డబ్బు కోసం మనుషుల మధ్య సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. ఆస్తులు కోసం ఐనవారినే చంపేస్తున్న దారుణ ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

డబ్బుకు లోకం దాసోహం అన్నట్టు డబ్బు కోసం మనుషుల మధ్య సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. ఆస్తులు కోసం ఐనవారినే చంపేస్తున్న దారుణ ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

తల్లిని చంపి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో దాచిన కూతురు!

ఈ మద్య చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కోరికతో ఎననో దారుణాలకు తెగబడుతున్నారు. లగ్జరీ జీవితం గడిపేందుకు సొంతమనుషులనే దూరం చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో చూశాం. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ అన్నట్లు ఆస్తులు, డబ్బు కోసం సొంతవారిని అత్యంత పాశవికంగా చంపుకుంటున్న దారుణ సంఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ధనికి కుటుంబానికి చెందిన ఓ మహిళను ఆమె సొంత కూతురు చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

డబ్బు వ్యామోహంలో పడి సొంత కుటుంబ సభ్యులను అతి దారుణంగా చంపేస్తున్న సంఘటనలు మానవ సంబంధాలను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు.  ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలో డబ్బు కోసం ఓ కూతురు తన తల్లిని చంపిన ఘటన సెన్సేషన్ క్రియేట్ చేసింది. కూతురుని ఎంతో ప్రాణంగా చూసుకుంటున్న కన్నతల్లిని డబ్బు కోసం తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన హిథర్ మాక్ (28) తన ప్రేమికుడితో కలిసి తన తల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని సూట్ కేసులో దాచింది. అప్పుడు హిథర్ వయసు 18 సంవత్సరాలు.. అంతేకాదు ఆ సమయానికి ఈమె గర్భవతి అని పోలీసుల దర్యాప్తులో తెలిపింది.

Daughter killed mother for money

హీథర్ మాక్ ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి.. తన ప్రేమ విషయం తల్లికి చెప్పనపుడు ఆమె వ్యతిరేకించింది. దీంతో తల్లిపై కక్ష్య పెంచుకుంది హీథర్.. అంతే కాదు ఆమె నుంచి డబ్బు కాజేయాలని స్కెచ్ వేసింది. 1.5 మిలియన్స్ అంటే మన కరెన్సీతో పోల్చిలో 12,46,88,475.00 ట్రస్ట్ ఫండ్ కోసం తల్లినే హత్య చేసింది. ఇందుకు ఆమె ప్రేమికుడి సహాయం తీసుకుంది. ఈ దారుణ కాండ మొత్తం ఓ హోటల్ జరిపింది హీథర్. హూటల్ లో మాక్ తన తల్లిని అరువకుండా నోటిని కట్టివేయగా.. ఆమె ప్రియుడు టామీ స్కేఫర్ తల్లి తలపై గట్టిగా కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని మాక్, టామీ కలిసి సూట్ కేసులో దాచి టాక్సీలో వదిలి వెళ్లిపోయారు. సూట్ కేసులోని మృతదేహం అవశేశాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటన 2014 బాలీలో జరిగింది. ఇందులో ప్రధాన ముద్దాయిగా తేలిని హీథర్ మాక్ కి 26 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. 2015 లో హీథర్ ని ఇండోనేషియాలో దోషిగా నిర్ధారించబడింది. 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఆమె 2021లో విడుదలైంది.. అనంతరం హీథర్ అమెరికా చేరుకొని అక్కడ మరోసారి అరెస్ట్ అయ్యింది. అమెరిన్ వ్యక్తిని చంపిన నేనంపై హీథనర్ మాక్ గత రెండేళ్లుగా చికాగో జైలులో గడిపింది. ఆమె ప్రియుడు ప్రస్తుతం ఇండోనేషియా జైలుతో ఖైదీగా గడుపుతున్నాడు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.