డబ్బు పేరిట తండ్రి మోసం.. సినిమా స్టైల్లో పిల్లలను ఎత్తుకెళ్లిన దుండగులు

Bengaluru Kidnap: డబ్బు పేరుతో తండ్రి మోసం చేయడంతో నిందితులు కిడ్నాప్ కు తెరలేపారు. ఆ వ్యక్తి పిల్లలను పట్టపగలే కిడ్నాప్ చేశారు. లైవ్ కిడ్నాప్ తో తీవ్ర కలకలం రేగింది. ఇంతకీ ఎక్కడంటే?

Bengaluru Kidnap: డబ్బు పేరుతో తండ్రి మోసం చేయడంతో నిందితులు కిడ్నాప్ కు తెరలేపారు. ఆ వ్యక్తి పిల్లలను పట్టపగలే కిడ్నాప్ చేశారు. లైవ్ కిడ్నాప్ తో తీవ్ర కలకలం రేగింది. ఇంతకీ ఎక్కడంటే?

డబ్బు కారణంగా ఎన్నో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్తుల కారణంగా అన్నదమ్ముల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. డబ్బు కోసం ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడడం లేదు. డబ్బు పేరిట జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్ని కావు. అధిక వడ్డీల పేరుతో డబ్బు వసూలు చేసి పరారైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. పెట్టిన పెట్టుబడి డబుల్ చేస్తామంటూ నమ్మబలికి మోసాలకు తెగబడుతున్నారు. ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. బాధితులు మోసం చేసిన వారిపై కంప్లైంట్ ఇస్తుంటారు. మరికొందరు కోపం పెంచుకుని వారికి సరైన బుద్ది చెప్పాలనుకుంటుంటారు.

ఇదే తరహాలో డబ్బుల పేరిట మోసపోయిన యువకులు మోసం చేసిన వ్యక్తి ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా ఆ వ్యక్తి పిల్లలను ఎత్తుకెళ్లారు. పట్టపగలే ఇద్దరు చిన్నారులను లైవ్ కిడ్నాప్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. చిన్నారుల కిడ్నాప్ తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. ఓ వ్యక్తి ముగ్గురు యువకుల వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బును డబుల్ చేసి ఇస్తానని నమ్మబలికాడు. డబ్బులు రెట్టింపు అవుతున్నాయంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. ఈజీగా డబ్బు వస్తుంటే కాదనుకోలేరు కదా. ఈ నేపథ్యంలో ఆశతో ఆ యువకులు తమ డబ్బును ముట్టజెప్పారు. ఇలా కొంత కాలం గడిచిపోయింది. అయితే ఎంతకు తమ డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చాడు.

దీంతో ఆ యువకులు అతడిని నిలదీశారు. అతడు మాత్రం డబ్బులు ఇవ్వకుండా యువకులను మోసం చేశాడు. దీంతో యువకులు అతడిపై కోపం పెంచుకున్నారు. అతనికి ఎలాగైనా బుద్ది చెప్పాలనుకున్నారు. ఇందుకోస ఆ వ్యక్తి పిల్లలను కిడ్నాప్ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా కిడ్నాప్ కు ప్లాన్ చేశారు. మోసం చేసిన వ్యక్తి ఇంటికి వచ్చి చిన్నారుల అమ్మమ్మను మంచి నీళ్లు అడిగారు. మంచినీళ్ల పేరుతో ఆమెను ఏమార్చారు. ఇక ఆమె వారికి మంచినీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది. ఇదే అదునుగా చేసుకుని పిల్లలను ఎత్తుకుని దుండగులు పరారయ్యారు. పిల్లలను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టపగలే దర్జాగా ఇంట్లోకి వచ్చి ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేయడంతో అలజడి రేగింది.

బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలించారు. పోలీసులు దుండగులను పట్టుకునే సమయంలో రాళ్లు రువ్వి తప్పించుకునేందకు ప్రయత్నం చేశారు. దీంతో నిందితుడి కాలుపై పోలీసుల కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిందితుడి కాలికి గాయం అయ్యింది. ఫైనల్ గా కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లను వార చెర నుంచి కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుల్లో ఇద్దరు మహారాష్ట్ర, ఒకరు బిహార్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తమ డబ్బులు తీసుకుని మోసం చేసిన తండ్రిపై కోపంతోనే పిల్లలను కిడ్నాప్ చేసినట్లు దుండగులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి పిల్లలను లైవ్ కిడ్నాప్ చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments