iDreamPost

అమెరికాలో కారు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతితో కుటుంబాల్లో తీరని విషాదం నెలకొన్నది.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతితో కుటుంబాల్లో తీరని విషాదం నెలకొన్నది.

అమెరికాలో కారు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి

ఇటీవల చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఓవర్ స్పీడ్ తో వెళ్లి నిండు నూరేళ్ల జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. కన్న వారికి తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. అతివేగం ప్రమాదకరం అని ఎంత చెప్పినా వినకుండా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు అర్థాంతరంగా తనువులు చాలించటంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

యూఎస్ లో కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఐదుగురు యువతీ యువకులు ప్రయాణిస్తున్న కారు అతి వేగంతో దూసుకెళ్లింది. నిర్లక్ష్యంగా కారును నడపడంతో అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని రిత్వాక్ సోమేపల్లిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని శ్రీయ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మగా గుర్తించారు. నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి.

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద బాధితులంతా 18 ఏళ్ల వయసు గలవారని తెలుస్తోంది. వీరంతా ఆల్ఫారెట్టా ఉన్నత పాఠశాల మరియు జార్జియా విశ్వవిద్యాలయ విద్యార్థులు. వారిని అల్ఫారెట్టా హైస్కూల్‌లో సీనియర్ ఆర్యన్ జోషి, జార్జియా యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీయ అవసరాల, అన్వీ శర్మగా గుర్తించారు. అతి వేగం కారణంగానే కారు ప్రమాదానికి గురైనట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల అమెరికాలో పలువురు భారతీయ విద్యార్థులు దుండగుల చేతిలో మృత్యువాత పడడం తీవ్ర కలకలం రేపింది. అమెరికాలో భారతీయ విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి