iDreamPost
android-app
ios-app

స్వప్న హత్య కేసు.. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమా?

చంపాపేట్ లో వివాహిత స్వప్న హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే స్వప్న హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తాజాగా వివరించారు.

చంపాపేట్ లో వివాహిత స్వప్న హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే స్వప్న హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తాజాగా వివరించారు.

స్వప్న హత్య కేసు.. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమా?

హైదరాబాద్ లోని చంపాపేట్ లో వివాహిత స్వప్న హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం ఆ యువతిని ఆమె భర్త కత్తితో దారుణంగా హత్య చేశాడు. ఈ సమయంలోనే ఆమె భర్త వీరు అద్దెకు ఉంటున్న బిల్డింగ్ పై నుంచి కింద పడిపోవడంతో పలు అనుమానాలకు తావు ఇచ్చింది. దీంతో స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్వప్న మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం, భర్తను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే స్వప్న హత్యకు గల కారణాన్ని కూడా వెల్లడించారు. అసలు స్వప్న హత్యకు కారణం ఏంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా హన్వడ కొత్తపేట తండాకు చెందిన స్వప్న (21) నెల కిందట మహేశ్వరానికి చెందిన ప్రేమ్ కుమార్ (24) అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఈ దంపతులు నగరంలోని చంపాపేట్ ఎన్ జీఆర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే ఈ క్రమంలోనే స్వప్న సతీష్ అనే యువకుడితో గత కొన్ని రోజుల నుంచి వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. భర్త లేని సమయంలో స్వప్న ప్రియుడిని ఇంటికి రప్పించుకునేది. ఇలా ఆ మహిళ భర్త కళ్లు గప్పి ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే.. శనివారం స్వప్న ఇంటికి ఆమె ప్రియుడితో పాటు మరో యువకుడు వచ్చాడు. ప్రియుడితో ఆ మహిళ ఇంట్లో ఉండగా ఆమె భర్త ప్రేమ్ కుమార్ సడెన్ గా ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరిని చూసి అతడు షాక్ గురయ్యాడు.

కోపంతో ఊగిపోయిన ఆమె భర్త ప్రేమ్ కుమార్.. ఇంట్లో ఉన్న కత్తితో స్వప్నను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ క్రమంలోనే సతీష్, ప్రేమ్ కుమార్ గొడవ పడ్డారు. దీంతో సతీష్ ప్రియురాలి భర్త ప్రేమ్ కుమార్ ను బిల్డింగ్ పై నుంచి కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని స్వప్నను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్ కుమార్ ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కోమాలోకి వెళ్లిన ఆ యువకుడు ఆ తర్వాత స్పృహలోకి వచ్చాడు. ఆ తర్వాత అతడు జరిగిందంతా పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు స్వప్న హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిపారు.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom Giriş