iDreamPost
android-app
ios-app

రెచ్చిపోయిన దొంగలు.. ఎస్సై ఇంట్లోనే దొంగతనం!

  • Published Dec 11, 2023 | 3:08 PM Updated Updated Dec 11, 2023 | 3:08 PM

ఈ మద్య కాలంలో చాలా మంది ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. అందుకోసం దొంగతనాలు చేయడం, ఎదుటి వారిని మోసం చేసి డబ్బు సంపాదించడం సర్వసాధారణం అయ్యింది.

ఈ మద్య కాలంలో చాలా మంది ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. అందుకోసం దొంగతనాలు చేయడం, ఎదుటి వారిని మోసం చేసి డబ్బు సంపాదించడం సర్వసాధారణం అయ్యింది.

రెచ్చిపోయిన దొంగలు.. ఎస్సై ఇంట్లోనే దొంగతనం!

ఈ మద్య ఈజీ మనీ కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఎదుటివారిని మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇండ్లలో దొంగతనాలు, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ వ్యాపారం ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు. మరికొంతమంది సైబర్ నేరాలకు పాల్పపడుతూ కోట్లు దండుకుంటున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. సాధారణంగా ఇంట్లో దొంగలు పడితే వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాం.. కానీ కొన్నిసార్లు దొంగలు ఏకంగా పోలీసుల ఇళ్లకే కన్నం వేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా లోని పాలకొండలో ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పాలకొండలో దొంగలు రెచ్చిపోయారు.. ఒకే రాత్రి వరుస దొంగతనాలకు పాల్పపడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. ట్విస్ట్ ఏంటంటే దొంగలు ఏకంగా ఎస్సై ఇళ్లు కూడా దోచుకున్నారు. పోలీస్ ఇంట్లో దొంగతనం జరగడం ఒక ఎత్తైతే.. ఆ ఇండ్లు డీఎస్పీ కార్యాలయానికి కూత వేటులో ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి పాలకొండలో ఎస్‌ఐ లావణ్య, ఓ కానిస్టేబుల్ ఇంట్లో దొంగలు పడడారు. ఎస్సై ఇంట్లో అందింనంత దోచుకువెళ్లారు. ఈ క్రమంలనే కానిస్టేబుల్ ఇంట్లో చోరీకి ప్రయత్నించగా పెద్దగా దొరకకపోవడంతో వెనుతిరిగినట్లు తెలుస్తుంది.

దొంగతనం జరిగిన రోజు పాలకొండ డీఎస్పీ ఆఫీస్ కి సమీపంలో నివాసం ఉంటున్న దిశ పోలీస్ స్టేషన్ ఎస్సై లావణ్య డ్యూటీ నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్లారు. ఆ రోజు రాత్రి పార్వతీపుంలో ఉండిపోయారు.. ఆమె తల్లి రూప ఊరికి వెళ్లడం గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి నగదు, బంగారం చోరీ చేశారు. మరుసటిరోజు ఎస్సై లావణ్య పక్కింటివాళ్ళు తలుపులు తెరిచి ఉండటం గమనించి వెంటనే ఆమెకు సమాచారం అందించారు. ఎస్సై ఇంటితో పాటు అదే విధిలో ఉంటున్న పంచాయతీరాజ్ ఉద్యోగి కాంతారావు ఇళ్లు కూడా దోచుకున్నారు. ప్రస్తుతం ఆయన కాశీ యాత్రలో ఉండగా ఇంటికి తాళం వేయడం చూసి చోరీకి పాల్పపడ్డారు. ఆయన ఇంట్లో రూ.60 వేలు, బంగారం చోరీ చేశారు దొంగలు. ఏక కాలంలో దొంగలు రెచ్చిపోయి దొంగతనం చేశారు.. అదికూడా ఇద్దరు పోలీస్ డిపార్ట్ మెంట్ వారికి సంబంధించినవే కావడం విశేషం. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.