iDreamPost
android-app
ios-app

చంపుతామంటూ అంబానీకి వార్నింగ్.. తెలంగాణ యువకుడి అరెస్ట్!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి మరోసారి చంపుతామంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి, దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తెలంగాణకు చెందిన ఓ యువకుడిని అరెస్ట్ చేశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి మరోసారి చంపుతామంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి, దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తెలంగాణకు చెందిన ఓ యువకుడిని అరెస్ట్ చేశారు.

చంపుతామంటూ అంబానీకి వార్నింగ్.. తెలంగాణ యువకుడి అరెస్ట్!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి గత కొంత కాలం నుంచి బెదిరింపు మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చంపుతామంటూ గతేడాది ఓ యువకుడు వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆ ఘటన మరువక ముందే అక్డోబర్ 27న మరోసారి అంబానీకి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే మీమ్మల్ని అంతమొందిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈసారి రూ.200 కోట్లు ఇవ్వకుంటే ఖచ్చితంగా చంపేస్తామంటూ అక్టోబర్ 31న మరోసారి బెదిరింపు మెయిల్స్ పంపారు. ఆ మెయిల్స్ కు ఎవరూ ఎవరూ స్పందించలేదు.

దీంతో ఆగ్రహానికి గురై నవంబర్ 1న రూ.400 కోట్లు ఇవ్వకుంటే ముఖేష్ అంబానీని చంపేస్తాంటూ గట్టిగా వార్నింగ్ తో మెయిల్స్ పంపారు. వరుసగా బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే విచారణ జరపగా బెదిరింపు మెయిల్స్ పంపింది ఎవరో కాదు.. తెలంగాణకు చెందిన షాదాబ్ ఖాన్ అనే యువకుడని పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలం నుంచి రెండు మూడు సార్లు ఇదే వార్నింగ్ ఇచ్చింది కూడా ఇతడేనని పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతనే చంపుతామని బెదిరింపులకు పాల్పడడంతో అంతా షాక్ గురవుతున్నారు.