iDreamPost
android-app
ios-app

ఫామ్ హౌస్ లో భార్యల మార్పిడి పార్టీ.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

  • Published Nov 08, 2023 | 1:48 PM Updated Updated Nov 08, 2023 | 1:48 PM

ఫామ్ హౌస్ లో భార్యల మార్పిడి పార్టీ. భార్యల మార్పిడి ఏంటని షాకవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఓ దంపతులు కొందరు భార్యాభర్తలను పార్టీ పేరుతో ఫామ్ హౌస్ కు రప్పించి ఈ గలీజ్ దందాను నడిపిస్తున్నారు. ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫామ్ హౌస్ లో భార్యల మార్పిడి పార్టీ. భార్యల మార్పిడి ఏంటని షాకవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఓ దంపతులు కొందరు భార్యాభర్తలను పార్టీ పేరుతో ఫామ్ హౌస్ కు రప్పించి ఈ గలీజ్ దందాను నడిపిస్తున్నారు. ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Published Nov 08, 2023 | 1:48 PMUpdated Nov 08, 2023 | 1:48 PM
ఫామ్ హౌస్ లో భార్యల మార్పిడి పార్టీ.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు చూస్తుంటే చివరికి పోలీసులే బిత్తరపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా కొందరు దంపతులు కట్టుకున్నవారి కళ్లు గప్పి ఇతరులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో హత్య చేయడమో లేదంటే, ఆత్మహత్య చేసుకోవడమో చేస్తున్నారు. అలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకొక చోటు వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మరి కొందరు భర్తలు మాత్రం ఎవరూ ఊహించిన దారుణాలకు పాల్పడుతున్నారు. బర్త్ డే పార్టీల పేరుతో భార్యలను ఫామ్ హౌస్ లకు తీసుకెళ్లి అక్కడ పాడు పనులకు పాల్పడుతున్నారు. ముందే ప్లాన్ వేసుకుని భార్యను మరొకరితో గడపాల్సిందిగా కోరుతున్నారు. ఇలాంటి ఘటనే గతేడాది కేరళలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా చెన్నైలో మరొకటి చోటు చేసుకుంది. ఇటీవల ఓ బాధిత మహిళ తనకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి భార్యల మార్పిడి పార్టీ గురించి విస్తుపోయే నిజాలు తెలిశాయి.

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు కోయంబత్తూరులోని ఓ ప్రాంతంలో సింథిల్ కుమార్ (45)-జయలక్ష్మి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు నిరుపేద మహిళలను ఆసరాగా చేసుకుని ఈ స్వాప్ పార్టీని ఏర్పాటు చేసుకుని ఈ గలీజ్ దందాను నిర్వహిస్తున్నారు. పార్టీ పేరుతో మహిళలు, యువకులతో రప్పించి ఆ తర్వాత కొంత రేటుకు మాట్లాడుకుంటారు. అనంతరం వారు శారీరకంగా కలిసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఇదిలా ఉంటే.. బర్త్ డే పార్టీల పేరుతో నగరంలోని ఓ ఫామ్ హౌస్ ను ముందే బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత వీరి పార్టీకి కొందరు దంపతులను కూడా పిలుస్తారు. ఈ వేడుకలో మందు, చిందుతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక ఫుల్ గా మద్యం మత్తులోకి జారుకున్నాక వారి భర్తలకు ముందే ఒప్పందంతో తమ భార్యను మరొకరితో శారీరకంగా కలిసేలా మాట్లాడుకుంటారు.

ఇలా ఈ పాడు దందాను సింథిల్ కుమార్-జయలక్ష్మి దంపతులు 2018 నుంచి కొనసాగిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో లేలింది. ఇక అచ్చం ఇలాగే నవంబర్ 4, 5 తేదీల్లో కూడా ఈ దంపతులు బర్త్ డే పేరుతో ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇక్కడికి 8 మంది జంటలతో పాటు మరి కొంతమంది యువకులను, మహిళలను ఆహ్వానించారు. ఇక్కడ వీరికి మందు, చింతు అన్ని ఏర్పాట్లు ముందే చేసి పెట్టారు. అయితే ఇక్కడికి వచ్చిన ఓ భర్త తన భార్యను మరొకరితో శారీరకంగా కలవాలని కోరతాడు. దీనికి అతని భార్య నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే దీనిపై కేరళకు చెందిన ఓ మహిళ తనకు జరిగిన దారుణంపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా.. ఈ భార్యల మార్పిడి వ్యవహారం బట్టబయలైంది. ఇక వెంటనే పోలీసులు సింథిల్ కుమార్ -జయలక్ష్మి దంపతులను విచారించి వారిని అరెస్ట్ చేశారు. ఇక వీరితో పాటు 8 మంది మహిళలను, 15 పురుషులను కూడా అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom