iDreamPost
android-app
ios-app

భర్తను కాదని మహిళ, భార్యను కాదని ఓ భర్త! చివరికి జరిగింది ఇదే!

భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు పరాయి వాళ్ల కోసం పాకులాడి చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు పరాయి వాళ్ల కోసం పాకులాడి చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

భర్తను కాదని మహిళ, భార్యను కాదని ఓ భర్త! చివరికి జరిగింది ఇదే!

వివాహేతర సంబంధాల కారణంగా చాలా మంది జీవితాలు రోడ్డున పడేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు పరాయి వాళ్ల కోసం పాకులాడి చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాగే ఓ ఇద్దరు వ్యక్తులు.. కట్టుకున్న వాళ్లను కాదని ఇతరులతో కలిసి ఉండేందుకు ప్రయత్నించారు. కట్ చేస్తే.. వాళ్లే ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోయారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు తిరుపత్తూరు జిల్లా వానియంబాడి ప్రాంతంలో చంద్రశేఖరన్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి ఉండేవాడు. అయితే ఉన్నఊళ్లో పనులు లేకపోవడంతో బతుకు దెరువు కోసం ఇతడు గతంలో బెంగుళూరుకు వెళ్లాడు. అక్కడే ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు. అయితే ఈ క్రమంలోనే చంద్రశేఖరన్ కు పూజ అనే వివాహిత పరిచయం అయింది. వీరి పరిచయం కాస్త చివరికి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఇద్దరు సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఇకపోతే, చంద్రశేఖరన్ పూజను వానియంబాడికి తీసుకొచ్చాడు. భార్యా భర్తలమని చెప్పి ఇక్కడే ఓ ఇంట్లో అద్దెకు దిగారు. పూజ కనిపించకపోవడంతో ఆమె భర్త జాడ కనిపెట్టి వీరున్న చోటకు వెళ్లాడు.

ఆ తర్వాత చంద్రశేఖరన్ నుంచి పూజను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో చంద్రశేఖరన్ తీవ్ర మనస్థాపానిరి గురై స్థానికంగా ఉన్న ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పూజ కూడా మరో బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఇదే విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా కట్టుకున్న వాళ్లను కాదని చివరికి ప్రాణాలతో లేకుండా పోయిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet