iDreamPost
android-app
ios-app

దారుణం: స్వరూపారాణి కేసులో వీడిన మిస్టరీ.. చంపింది ఎవరో కాదు..!

ఈ నెల 5న సూర్యాపేటలో ఓ ఇంట్లో ఈ మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు ఎవరో తేల్చారు. ఇంతకు ఆమెను ఎవరు హత్య చేశారంటే?

ఈ నెల 5న సూర్యాపేటలో ఓ ఇంట్లో ఈ మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు ఎవరో తేల్చారు. ఇంతకు ఆమెను ఎవరు హత్య చేశారంటే?

దారుణం: స్వరూపారాణి కేసులో వీడిన మిస్టరీ.. చంపింది ఎవరో కాదు..!

సూర్యాపేట జిల్లాకు చెందిన వైద్య ఉద్యోగి స్వరూపారాణి ఈ నెల 5న ఇంట్లో శవమై కనిపించిన విషయం తెలిసిందే. బాత్రూంలో సగం కాలిన ముఖంతో ఆమె అనుమానాస్పద స్థితిలో స్థితిలో మృతి చెందింది. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా ఈ కేసులో మిస్టరీ వీడడంతో పాటు ఆమె హత్యకు గరైందని పోలీసులు తెలిపారు. ఇంతకు స్వరూపారాణిని ఎవరు హత్య చేశారో తెలుసా?

పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేటలోని సీతారాంపురం కాలనీలో స్వరూపారాణి (55) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె కాసరబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆమెకు అంజన్ కుమార్ అనే తోడబుట్టిన సోదరుడు ఉన్నాడు. అయితే గతంలో ఇతడు తన తండ్రి పేరుమీదున్న ఆస్తి పేపర్లను చెల్లి స్వరూపారాణి వద్ద కుదువ పెట్టి రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. అలా చాలా రోజులు గడిచింది. అతడు అప్పు మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఇక తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తానని.. కానీ, నాకు ఆస్తి పేపర్లు ఇవ్వాలని గత ఆరు నెలల నుంచి చెల్లిని కోరుతున్నాడు. తండ్రి సంపాదించిన ఆస్తిలో నాకూ వాటా వస్తుందని, మొదటగా తీసుకున్న డబ్బు చెల్లించాలని ఫైర్ అయింది.

దీంతో అప్పటి నుంచి అంజన్ కుమార్ తన చెల్లి స్వరూరాణిపై కోపం పెంచుకున్నాడు. ఆస్తి పేపర్లు దక్కాలంటే చెల్లిని చంపాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ నెల 5న స్వరూపారాణి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహంపై బట్టలు వేసి నిప్పటించి ఆమె పుస్తెలతాడుతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. అయితే ఈ క్రమంలోనే మృతురాలి సోదరుడైన అంజన్ కుమార్ ను విచారించగా అతడు చేసిన నేరాన్ని అంగీకరించాడు. నా తండ్రి సంపాదించిన ఆస్త పేపర్ల ఆమె వద్ద కుదవబెట్టి కొంత డబ్బు తీసుకున్నాను. ఆ పేపర్లు నాకు ఇవ్వమంటే డబ్బు ఇచ్చేదాక ఇవ్వనని, పైగా ఈ ఆస్తిలో నాకూ వాటా ఉందని వివరించింది. అందకే కోపంతో నా చెల్లిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి