iDreamPost
android-app
ios-app

భర్త మృతి, ఒంటరిగా ఉంటున్న మహిళ.. దారుణం ఏంటంటే?

  • Published Nov 07, 2023 | 2:04 PM Updated Updated Nov 07, 2023 | 2:07 PM

స్వరూపరాణి అనే మహిళ సూర్యపేటలోని సీతారాంపురం కాలనీలో నివాసం ఉంటుంది. ఆమె భర్త గతంలోనే మరణించాడు. ఉన్న ఒక్క కూతురు పెళ్లి కూడా చేసింది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటూ వస్తుంది. కానీ, తాజాగా జరిగిన దారుణం ఏంటంటే?

స్వరూపరాణి అనే మహిళ సూర్యపేటలోని సీతారాంపురం కాలనీలో నివాసం ఉంటుంది. ఆమె భర్త గతంలోనే మరణించాడు. ఉన్న ఒక్క కూతురు పెళ్లి కూడా చేసింది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటూ వస్తుంది. కానీ, తాజాగా జరిగిన దారుణం ఏంటంటే?

  • Published Nov 07, 2023 | 2:04 PMUpdated Nov 07, 2023 | 2:07 PM
భర్త మృతి, ఒంటరిగా ఉంటున్న మహిళ.. దారుణం ఏంటంటే?

నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ బాత్రూంలో ఊహించని స్థితిలో శవమై కనిపించింది. పైగా ఆమె ఉంటున్న ఇంట్లో నుంచి పొగలు కూడా వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా.. బాత్రూంలో ఆ మహిళ అనుమనాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఈ సీన్ చూసి వాళ్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. సూర్యపేటలోని సీతారాంపురం కాలనీలో స్వరూపరాణి (55) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె సూర్యపేట మండలంలోని కాసరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె భర్త గతంలోనే మరణించాడు. ఇక స్వరూపరాణికి ఉన్న ఒక్క కూతురికి గతంలో ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించింది. ఇక అప్పటి నుంచి ఈ మహిళ సీతారాంపురంలోనే ఒంటరిగా నివాసం ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి ఆమె ఉంటున్న ఇంట్లో నుంచి ఉన్నట్టుండి పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆమె ఇంట్లోకి వెళ్లి చూశారు. గదిలో ఎవరూ కనిపించకపోవడంతో బాత్రూంలోకి వెళ్లి చూడగా.. స్వరూపరాణి ముఖం పూర్తిగా కాలిపోయి శవమై కనిపించింది. ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇదే సమాచారాన్ని ఆమె కూతురుకి చేర వేశారు. వెంటనే ఆస్పత్రికి చేరుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయిన తల్లిని చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆ తర్వాత మృతురాలి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఊహించని స్థితిలో స్వరూపరాణి బాత్రూంలో మృతి చెందడం, పైగా ఆమె ముఖం కాలిపోవడంతో పాటు ఇళ్లంతా పోగలు రావడంతో అనేక అనుమానాలకు తావు ఇస్తోంది. స్వరూపరాణి కరెంట్ షాక్ తో మరణించిందా? లేక ఎవరైన హత్య చేసి ఉంటారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobetgrandpashabetgrandpashabetganobetbetciojojobetgrandpashabet girişcasibom