iDreamPost
android-app
ios-app

Veedokkade: సూర్య సూపర్‌ హిట్‌ సినిమా సీన్‌ రిపీట్‌.. కడుపులో కొకైన్‌ దాచి..

  • Published Dec 22, 2023 | 8:49 PM Updated Updated Dec 22, 2023 | 8:49 PM

వీడొక్కడే సినిమాలో హీరో దేవ స్నేహితుడు చిట్టి తన కడుపులో కొకైన్‌ క్యాప్సల్స్‌ను స్మగ్లింగ్‌ చేస్తూ ఉంటాడు. అయితే, అనుకోని విధంగా చిట్టి చనిపోతాడు. సినిమా మలుపు తిరుగుతుంది.

వీడొక్కడే సినిమాలో హీరో దేవ స్నేహితుడు చిట్టి తన కడుపులో కొకైన్‌ క్యాప్సల్స్‌ను స్మగ్లింగ్‌ చేస్తూ ఉంటాడు. అయితే, అనుకోని విధంగా చిట్టి చనిపోతాడు. సినిమా మలుపు తిరుగుతుంది.

  • Published Dec 22, 2023 | 8:49 PMUpdated Dec 22, 2023 | 8:49 PM
Veedokkade: సూర్య సూపర్‌ హిట్‌ సినిమా సీన్‌ రిపీట్‌.. కడుపులో కొకైన్‌ దాచి..

స్టార్‌ హీరో సూర్య- దివంగత దర్శకుడు కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘‘వీడొక్కడే’’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ మూవీ 2009 ఏప్రిల్‌ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్‌ అయింది. తమిళంలో ‘అయన్‌’గా.. తెలుగులో ‘వీడొక్కడే’గా విడుదల అయింది. రెండు చోట్లా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక, ఈ సినిమా మొత్త స్మగ్లింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో నడుస్తుంది. ముఖ్యంగా ఈ మూవీలో కొకైన్‌ స్మగ్లింగ్‌ సీన్‌ చాలా పాపులర్‌ అయింది.

హీరో స్నేహితుడు చిట్టి కడుపులోకి కొకైన్‌ క్యాప్సల్స్‌ను మింగి స్మగ్లింగ్‌ చేస్తూ ఉంటాడు. అనుకోని విధంగా ఓ క్యాప్సల్‌ కడుపులో పగిలి అస్వస్థతకు గురి అవుతాడు. తర్వాత విలన్‌ గ్యాంగు చిట్టి కడుపులోని కొకైన్‌ క్యాప్సల్స్‌ కోసం అతడి పొట్ట కోసి వాటిని బయటకు తీస్తాయి. చిట్టి చచ్చిపోతాడు. ఇది ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. కథ మొత్తం మలుపు తిరుగుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. కడుపులో కొకైన్‌ క్యాప్సల్స్‌ స్మగ్లింగ్‌ చేయటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

ఎందుకంటే.. క్యాప్సల్స్‌ కడుపులో పగిలితే ప్రాణాలకే ప్రమాదం. ఇది తెలిసి కూడా కొంతమంది ‍ప్రాణాలకు తెగిస్తున్నారు. కడుపులో కొకైన్‌ క్యాప్సల్స్‌ స్మగ్లింగ్‌ చేస్తూ ఉన్నారు. తాజాగా, ఢిల్లీలో ఇలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది. కడుపులో కొకైన్‌ క్యాప్సల్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతి కడుపుని భారీ మొత్తంలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ ‍వ్యక్తి తన కడుపులోకి 234 గ్రాముల కొకైన్‌ క్యాప్సల్స్‌ను మింగాడు.

వాటిని తరలిస్తూ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులకు అతడిపై అనుమానం వచ్చింది. అదుపులోకి విచారించగా అసలు విషయం బయటపడింది. అతడి కడుపులో ఏకంగా రూ.3.51 కోట్ల విలువైన 234 గ్రాముల కొకైన్ క్యాప్సల్స్‌ ఉన్నట్లు తేలింది. అధికారులు ఎనీమా ఇచ్చి వాటిని బయటకు తీశారు. 2021లోనూ ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉగాండాకు చెందిన ఓ మహిళ ఏకంగా తన కడుపులో 993 గ్రాముల కొకైన్‌ను స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడింది.

మొత్తం 91 కొకైన్‌ క్యాప్సల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కొకైన్‌ విలువ ఏకంగా 19 కోట్ల రూపాయలని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. అప్పట్లో ఈ న్యూస్‌ సంచలనం సృష్టించింది. మరి, రియల్‌ లైఫ్‌లో సూర్య ‘‘వీడొక్కడే’’ సీన్‌ రిపీట్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom