iDreamPost
android-app
ios-app

అమ్మా నా భర్తతో కాపురం చేయలేనని తల్లికి ఫోన్.. కానీ కొన్ని గంటల్లోనే

కూతురు పుట్టిందని సంబరపడిపోయేలోపు.. ఆమె చదువులు, పెళ్లి భారం గురించి ఆలోచిస్తుంటారు. కానీ ఆమెకు ఓ లైఫ్ ఉందని చాలా మంది పేరెంట్స్ మర్చిపోతున్నారు. హడావుడిగా, ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తున్నారు. చివరకు

కూతురు పుట్టిందని సంబరపడిపోయేలోపు.. ఆమె చదువులు, పెళ్లి భారం గురించి ఆలోచిస్తుంటారు. కానీ ఆమెకు ఓ లైఫ్ ఉందని చాలా మంది పేరెంట్స్ మర్చిపోతున్నారు. హడావుడిగా, ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తున్నారు. చివరకు

అమ్మా నా భర్తతో కాపురం చేయలేనని తల్లికి ఫోన్.. కానీ కొన్ని గంటల్లోనే

ఎంతో కష్టపడి చదువుకుంది సుప్రియ. సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించింది. తల్లిదండ్రులు మంచి సంబంధం అమ్మా.. కుర్రాడు మంచి వాడు అంటే.. తల వంచుకుని తాళి కట్టించుకుంది. భారీ కట్న కానుకలతో కూతురికి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపారు. ఎన్నో కలలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది ఆమె . కానీ ఆ కలలు కల్లలుగా మారిపోవడానికి ఎంత సమయం పట్టలేదు. పెళ్లై ఆరు నెలల పూర్తి కాకుండానే.. పుట్టింటికి వచ్చేస్తానంటూ తల్లిని వేడుకుంది. కొత్త కాపురం అలాగే ఉంటుంది అని సర్దిచెప్పింది. కానీ చివరకు సుప్రియా జీవచ్ఛవంలా మారింది. ఆమె చావు కబురు పుట్టింటికి చేరింది. మీ బిడ్డ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటూ అల్లుడు సమాచారం అందించాడు. అమ్మా.. నీ దగ్గరకు వచ్చేస్తాను అని చెప్పిన కొన్ని గంటలకే కూతురి మరణవార్త చేరే సరికి తల్లడిల్లిపోయారు పేరెంట్స్. అల్లుడు ఏదో నాటకం అడుతున్నాడని గ్రహించారు. ఆమెను చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంతకు సుప్రియా జీవితంలో ఏం జరిగింది..? అల్లుడిపై అత్తమామలు కేసు ఎందుకు నమోదు చేశారంటే..?

మహబూబ్‌నగర్‌లోని దేవరకద్ర మండలం లక్ష్మీరెడ్డిపల్లికి చెందిన రామిరెడ్డి కుమారుడు ఎం.రాఘవేంద్రరెడ్డితో నందిపేట్‌కు చెందిన సుప్రియా రెడ్డితో ఈ ఏడాది మార్చిలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 50 లక్షల కట్నం, 50 తులాల బంగారం కట్నంగా అందించారు సుప్రియా పేరెంట్స్. ఇద్దరు హైదరాబాద్ నగరంలో సాఫ్ట్ వేర్లు కావడంతో కాపురం భాగ్యనగరికి షిఫ్ట్ అయ్యింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీగూడలో కాపురం పెట్టారు. పెళ్లైన కొత్తలో అంతా సవ్యంగా సాగిపోయింది. మెల్లిగా భర్తలో ఉన్న వరకట్న పిశాచి బయటకు రావడం స్టార్టయ్యింది. తన కన్నా తన ఆస్తిపై భర్త మోజు పడ్డాడని గ్రహించింది సుప్రియ. చివరకు తన జీతంపై పెత్తనం సాగించాడు. తల్లిదండ్రుల నుండి అదనపు డబ్బు తేవాలని, ఆమె పేరు మీద ఉన్న మూడు ఎకెరాల భూమి తన పేరు మీద రాయాలని భార్యను బలవంత పెట్టాడు. ఈ వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులకు పలు మార్లు చెప్పింది సుప్రియా. కానీ తల్లి ఆమెకు ధైర్యం నూరిపోసింది. సమస్యను బలంగా ఎదుర్కోవాలని చెప్పింది.

అయినప్పటికీ.. భర్త రాఘవేంద్ర ఆగడాలు ఆగిపోలేదు. మరింత పెరిగాయి. వేధింపులు ఎక్కువయ్యాయి. పండుగ ముందు రోజు ఫోన్ చేసి.. అమ్మా నేను ఇక్కడ ఉండలేకపోతున్నా..  ఇతడితో కాపురం చేయలేకపోతున్నా. తిరిగి ఇంటికి వచ్చేస్తా అంటూ ఏడ్చింది. ఏదో సర్ది చెప్పారు పేరెంట్స్. కానీ అదే రోజు రాత్రి సుప్రియ ఉరివేసుకుని చనిపోయిందని సమాచారం అందింది. అల్లుడు ఇంట్లో లేడని తెలిసే సరికి.. సుప్రియా తల్లిదండ్రులు KPHB పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అల్లుడిపై అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురు చనిపోయేంత పిరికి కాదని, అల్లుడే చంపి ఉంటాడని చెప్పారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమెను హింసించాడని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆడ పిల్లల్ని ఇచ్చేశాము.. బాధ్యత తీరిపోయింది, సంసారం అంటే ఇంతే.. అల్లుడు ఓ మాట అంటే భరించాలి అనుకుని కూతురుకు సర్ది చెప్పుకునే తల్లిదండ్రులు ఉన్నంత కాలం.. కూతుర్లు ఇలా బలికావాల్సిందేనా..? ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.