పెళ్లై ఏడాది గడవక ముందే.. ఆ కారణంతో వివాహిత షాకింగ్ నిర్ణయం

పెళ్లై ఏడాది గడవలేదు. అంతలోనే దారుణం చోటుచేసుకుంది. ఆ కారణంతో ఓ వివాహిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

పెళ్లై ఏడాది గడవలేదు. అంతలోనే దారుణం చోటుచేసుకుంది. ఆ కారణంతో ఓ వివాహిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలకే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరిష్కరించుకుంటే తీరిపోయే సమస్యలకు భయపడి దారుణాలకు ఒడిగడుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఆశలతో వివాహబంధంలోకి అడుగుపెట్టిన వారు కుటుంబ కలహాలు, గొడవల కారణంగా విడిపోవడమో లేదా ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు, అత్తింటి వేధింపులకు వివాహితలు బలైపోతున్నారు. అదనపు కట్నం కోసం వేధించడం వంటి ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. ఇదే రీతిలో ఓ వివాహిత అత్తింటి వేధింపులకు బలై పోయింది. పెళ్లై ఏడాది గడవక ముందే ప్రాణాలు కోల్పోయింది.

కూతురును కన్నబిడ్డ లాగ చూసుకోవాల్సిన అత్తింటి వారు తమ వక్రబుద్దిని చూపించారు. సూటిపోటి మాటలతో వేధింపులకు గురిచేశారు. వారి టార్చర్ భరించలేక వివాహిత లావణ్య తనువు చాలించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం ఆర్యనగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్యకు తొమ్మిది నెలల కిందట ఆర్యనగర్ కు చెందిన వెంకటేశ్ తో ఘనంగా వివాహం జరిగింది. కొంతకాలం వరకు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత అత్తింటి వారు కోడలిని వేధింపులకు గురిచేశారు. దీంతో వివాహిత లావణ్య మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో ఆషాఢ మాసం కావడంతో లావణ్య సుభాష్ నగర్ లోని తన పుట్టింటికి వచ్చింది.

అత్తింటి వేధింపులతో మానసిక వేధనకు గురైన లావణ్య మంగళవారం అర్ధరాత్రి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఇది గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో లావణ్య మృతి చెందింది. లావణ్య మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబంలో తీవ్ర విషాఛాయలు అలుముకున్నాయి. అత్తింటి వేధింపుల వల్లే లావణ్య సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Show comments