iDreamPost
android-app
ios-app

భగ్గుమన్న రాజస్థాన్.. పట్టపగలే కర్ణిసేన చీఫ్ దారుణ హత్య..!

  • Published Dec 06, 2023 | 11:44 AM Updated Updated Dec 06, 2023 | 11:44 AM

ఈ మద్య దేశంలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. చోటా మోటా నేరగాళ్లకు కూడా మార్కెట్ లో ఆయుధాలు అందుబాటులోకి వస్తున్నాయి. అక్రమ ఆయుధాలు కొనుగోలు చేస్తూ కేటుగాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.

ఈ మద్య దేశంలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. చోటా మోటా నేరగాళ్లకు కూడా మార్కెట్ లో ఆయుధాలు అందుబాటులోకి వస్తున్నాయి. అక్రమ ఆయుధాలు కొనుగోలు చేస్తూ కేటుగాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.

  • Published Dec 06, 2023 | 11:44 AMUpdated Dec 06, 2023 | 11:44 AM
భగ్గుమన్న రాజస్థాన్.. పట్టపగలే కర్ణిసేన చీఫ్ దారుణ హత్య..!

ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడ్డాయి. రాజస్థాన్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గత కొంత కాలంగా ప్రతి ఎన్నికల్లో అధికార పార్టీని గద్దె దింపి.. ప్రతిపక్ష పార్టీకి పట్టం కడుతున్నారు ఇక్కడ ప్రజలు. రాజస్థాన్ లో రాజకీయాలు ఎప్పుడూ వాడీ వేడిగా కొనసాగుతుంటాయి. బీజేపీ ప్రభుత్వాన్నిఏర్పాటు చేసే తరుణంలో ఓ కీలక నేతను కొంతమంది దుండగులు పట్టపగలే అతని నివాసం వద్ద అత్యంత దారుణంగా హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. హత్యకు నిరసనగా ఆ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.. బంద్ పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ కి చెందిన రాష్ట్రీయ రాజ్‌పూత్ కర్ణిసేన అధ్యక్షులు సుఖ్‌దేవ్ సింగ్ గొగమేడీని కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంట్లోకి వచ్చి మరీ విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనలతో ఒక్కసారిగా జైపూర్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ సామాజిక నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవి ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమరాలో రికార్డు అయ్యాయి. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం సుఖ్ దేవ్ తో ముఖ్యవిషయాలు మాట్లాడాలని భద్రతా సిబ్బందికి చెప్పి ఇంట్లోకి వెళ్లారు. గోగామేడితో మాట్లాడుతున్న సమయంలోనే తమ వెంట తెచ్చుకున్న గన్స్ ని బయటకు తీసి అత్యంత సమీపం నుంచి దారుణంగా కాల్పులు జరిపారు. ఆయన తో పాటు మరికొందరిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాలో ఉన్న ఆధారాలతో నింధితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సుఖ్‌దేవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

గతంలో పద్మావతి మూవీ ఎన్నో వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు సుఖ్‌దేవ్ సింగ్ గొగమేడీ. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది. దీంతో ఈ చిత్రం పేరు నిర్మాతలు పద్మావత్ గా మార్చవలసి వచ్చింది. అంతేకాదు కొన్ని సన్నివేశాలు కూడా తొలగించారు చిత్ర యూనిట్. అలా సుఖ్‌దేవ్ సింగ్ గొగమేడీ చేసిన ఆందోళన ఫలితంగానే హిందువుల ప్రతిష్ట పెరిగిందని యువతలో మంచి పేరు సంపాదించారు. తర్వాత ఆయన రాజకీయాల వైపు మొగ్గు చూపించారు. 2018 ఎన్నికలల్లో బీజేపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. కొన్నేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సుఖ్‌దేవ్ సింగ్ గొడవ పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సుఖ్ దేవ్ హత్యకు తమదే బాధ్యత అంటూ లారెన్స్ గ్యాంగ్స్ అనుబంధంగా పనిచేస్తున్న రోహిత్ గోదారా గ్యాంగ్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు గొగమేడీ కి మద్దతుగా బుధవారం రాజస్థాన్ బంద్ కు పిలుపునిచ్చారు.