iDreamPost
android-app
ios-app

టీనేజర్ చేసిన పనికి .. అనాధగా మారిన బాలిక

ఇటీవల కాలంలో బయటకు వెళుతున్నామంటే ఇంటికి సేఫ్టీగా తిరిగి వస్తామన్న నమ్మకం ఉండటం లేదు. లైఫ్ పై హోప్ పోయేలా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘటన తాలూకా వీడియో వైరల్ అవుతుంది.

ఇటీవల కాలంలో బయటకు వెళుతున్నామంటే ఇంటికి సేఫ్టీగా తిరిగి వస్తామన్న నమ్మకం ఉండటం లేదు. లైఫ్ పై హోప్ పోయేలా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘటన తాలూకా వీడియో వైరల్ అవుతుంది.

టీనేజర్ చేసిన పనికి .. అనాధగా మారిన బాలిక

బయటకు వెళుతున్నామంటే ఇంటికి సేఫ్టీగా తిరిగి వస్తామన్న నమ్మకం లేదు ఈ రోజుల్లో. ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య కాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువయ్యాయి. బండి చేతిలో ఉందని ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసి వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు. రాంగ్ రూట్లలోకి రావడం, రాంగ్ పార్కింగ్, తప్పతాగి వాహనాన్ని నడపడం, రాష్ డ్రైవింగ్, ఓవర్ టేక్ చేసే సమయంలో నియంత్రణ కోల్పోవడం యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. అయితే ఇటీవల మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్ యాక్సిడెంట్స్ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పూణే ఘటనలో మైనర్ డ్రైవ్ చేయడం వల్ల ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మరణించిన సంగతి విదితమే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. 18 ఏళ్ల లోపు చిన్నారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

మొన్న పూణే ఘటన మర్చిపోక ముందే.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగి ఘటన కలవరపాటుకు గురి చేస్తుంది. 17 ఏళ్ల బాలుడు కారును స్కూటర్ పై వెళుతున్న తల్లీకూతుళ్లను వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో తన తల్లిలాంటి ఓ అమ్మను కడుపున పెట్టుకున్నాడు మైనర్.  బాలికను అమ్మ లేని అనాథను చేశాడు. హారిబుల్ ఇన్సిడెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కారు నడుపుతున్న విధానం చూస్తూ వాహనంపై ఎటువంటి అవగాహన లేకుండా కారు నడుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం ఈ శుక్రవారం జరగ్గా.. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను చూస్తే.. రోడ్డుపై వెళ్లాలంటే భయం వేసేలా ఉంది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లోని గిత్వాయి నగర్ ప్రాంతంలో మహిళ తన కూతురితో కలిసి స్కూటర్ మీద వెళుతుండగా.. ఒక్కసారిగా కారు వీరి మీదకు దూసుకు వచ్చింది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో తల్లీ కూతుళ్లు ఊహించలేకపోయారు. హెల్మెట్ ధరించి ఉన్నా కారు వచ్చిన వేగానికి, స్కూటర్‌ను ఈడుకెళ్లగా.. తల్లీ కూతురు, బండి అల్లంత దూరానా పడ్డారు. వెంటనే స్థానికులు ఈ ఇద్దర్ని ఆసుపత్రికి తరలించారు. కానీ మహిళ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన కూతురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి జువైనల్ జస్టిస్ బోర్డ్ ముందు హాజరు పరిచారు. ఓ మైనర్ చేసిన తప్పు వల్ల తనలాంటి ఓ చిన్నారి అమ్మను కోల్పోయింది. మహిళను కోల్పోయి ఆమె కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది.