కన్న తండ్రి, సొంత తమ్ముడు కలిసి ఈ యువకుడిని చంపేశారు! అంత శిక్ష దేనికంటే?

Ramanjaneyulu Anakapalle missing case: ఎలమంచిలిలో రామాంజనేయులు అనే వ్యక్తి కనిపించకుండా పోయిన కేసును పోలీసులు ఛేదించారు. అయితే కన్న తండ్రి, సోదరుడే ఈ హత్యకు కారణం అంటూ పోలీసులు తేల్చారు.

Ramanjaneyulu Anakapalle missing case: ఎలమంచిలిలో రామాంజనేయులు అనే వ్యక్తి కనిపించకుండా పోయిన కేసును పోలీసులు ఛేదించారు. అయితే కన్న తండ్రి, సోదరుడే ఈ హత్యకు కారణం అంటూ పోలీసులు తేల్చారు.

ఎలమంచిలికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి మిస్సింగ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును తాజాగా పోలీసులు ఛేదించారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఏకంగా ఏడుగురిని రిమాండుకు పంపారు. ఇది మిస్సింగ్, ఆత్మహత్య కేసు కాదని.. మర్డర్ కేసుగా తేల్చారు. సొంతవాళ్లే రామాంజనేయులు మృతికి కారణం అంటూ ధృవీకరించారు. సోదరుడు, కన్న తండ్రే అసలు కారకులు అంటూ పోలీసులు విచారణలో తేల్చారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన వివరాలు సంచలనంగా మారాయి. అసలు కన్నవాళ్లు, తోడ పుట్టినవాడు ఎందుకు హత్య చేయించారు అనే వివరాలు వైరల్ గా మారాయి.

ఎలమించిలికి చెందిన రామాంజనేయులు మే 21 నుంచి కనిపించడం లేదు అంటూ అతని భార్య సేనాపతి శ్రీదేవి మే 23న మాడుగుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముందుగా ఈ కేసును మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు తర్వాత దీనిని హత్య కేసుగా తేల్చారు. ఫిర్యాదు అందిన తర్వాత కొక్కిరాపల్లి దగ్గర ఒక గుర్తు తెలియని మృతదేహం లభించింది. ఆ మృతదేహం రామాంజనేయులుదే అని అతని భార్య ధృవీకరించింది. ఆ తర్వాత కేసు దర్యాప్తు కోసం పోలీసులు ఏకంగా 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాతే కేసులో అసలు విషయాలు వెలుగు చూశాయి.

ఆర్థిక పరమైన అంశాలే:

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత నిన్న(28-05-2024) రామాంజనేయులు తండ్రి సేనాపతి నాగరాజు(ఏ2), మృతుడి తమ్ముడు సేనాపతి శివాజీ(ఏ1), శీలంనేని గోపి సతీశ్(ఏ3) వీఆర్వో సమక్షంలో నేరం అంగీకరించి లొంగిపోయారు. ఈ హత్యకు గల కారణాలు ఆస్తి తగాదేలే అంటూ విచారణలో తేలింది. రామాంజనేయులుకు అతని తండ్రి నాగరాజు, సోదరుడు శివాజీలకు గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. తండ్రి దగ్గర రూ.6 లక్షలు తీసుకుని రామాంజనేయులు రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. కానీ, అది సరిగ్గా నడవడం లేదు అని ఇంకా డబ్బు కావాలని తండ్రిని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు. ఇంకా డబ్బులు కావాలని తల్లిదండ్రులను, సోదరుడిని కొట్టేవాడంట. రామాంజనేయులు ప్రవర్తనతో విసిగిపోయే వాళ్లు ఈ దారుణానికి ఒడిగట్టారు అంటున్నారు. పథకం ప్రకారం రామాంజనేయులను హత్య చేయించినట్లు తెలిపారు.

పథకం ప్రకారమే:

రామాంజనేయులు హత్య పక్కా పథకం ప్రకారమే జరిగింది. అతని సోదరుడు శివాజీ తనతో కలిసి పనిచేసే తన స్నేహితుడితో ఈ విషయం చెప్పాడు. రామాంజనేయులును హత్య చేసేందుకు అతనికి డబ్బు కూడా ఇచ్చారు. ఆ తర్వాతే రామాంజనేయులు హత్యకు పథకం పన్నారు. ఏ3 నుంచి ఏ7 వరకు అంతా కలిసి పక్కా ప్రణాళిక తో ఈ పని చేశారు. మే 20వ తారీఖున హంతకులకు రామాంజనేయులు ఇల్లు, రెస్టారెంట్ చూపించారు. ఆ తర్వాత అతని కదలికలను గమనిస్తూ వచ్చారు. ముందుకు అనుకున్న ప్రకారం అందరూ అతని రెస్టారెంట్ కి వెళ్లి అతనితో మద్యం తాగించి.. డ్రాప్ చేస్తామని కారులో తీసుకెళ్లారు. మధ్యలో కత్తితో పొడిచి చంపేశారు. మృతదేహాన్ని ఎలమంచిలి మండలం కొక్కిరపల్లి వద్ద ట్యాకులో పడేసి వెళ్లిపోయారు. ఈ హత్య చేసినందుకు శివాజీ.. హంతకులకు రూ.6 లక్షల డబ్బు అందజేశాడు.

Show comments