iDreamPost
android-app
ios-app

Yediyurappa: మైనర్‌ బాలికపై మాజీ CM యడియూరప్ప లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు

  • Published Mar 15, 2024 | 9:59 AM Updated Updated Mar 15, 2024 | 9:59 AM

సాయం కోరడానికి వచ్చిన ఓ మైనర్‌ బాలికపై మాజీ సీఎం ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆయనపై పోక్సో కేసు నమోదయ్యింది. ఆ వివరాలు..

సాయం కోరడానికి వచ్చిన ఓ మైనర్‌ బాలికపై మాజీ సీఎం ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆయనపై పోక్సో కేసు నమోదయ్యింది. ఆ వివరాలు..

  • Published Mar 15, 2024 | 9:59 AMUpdated Mar 15, 2024 | 9:59 AM
Yediyurappa: మైనర్‌ బాలికపై మాజీ CM యడియూరప్ప లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు

సమాజంలో ఆడవారిపై అకృత్యాలకు అంతుపొంతు లేకుండా పోతుంది. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఇలా వేధింపులకు గురవుతున్నారు. ఎంత కఠిన చట్టాలు తెచ్చినా లాభం లేకుండా పోతుంది. మరీ దారుణమైన అంశం ఏంటంటే.. జనాలను ఏలే నేతలే.. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుండటం. కంచె చేను మేసింది అన్న చందంగా ఆడవారికి రక్షణగా ఉండాల్సిన పాలకులు.. కీచకులుగా మారుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ మాజీ సీఎం మీద పోక్సో కేసు నమోదయ్యింది. సదరు ముఖ్యమంత్రి మైనర్‌ బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు ఎవరా సీఎం.. అంటే..

ఈ సంచలన ఆరోపణలు వచ్చింది కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప మీద. ఆయన ఓ మైనర్‌ బాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 17 ఏళ్ల బాలిక.. మాజీ సీఎంపై ఈ సంచలన ఆరోపణలు చేసింది. యడియూరప్ప తనను లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తల్లితో కలిసి.. బెంగళూర్‌లోని సదాశివనగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు కంప్లైంట్‌ మేరకు సదాశివనగర్‌ పోలీసులు యడియూరప్ప మీద పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తల్లి, ఆమె కుమార్తె యడియూరప్ప దగ్గరకు వెళ్లిన సమయంలో మైనర్‌ బాలికపై మాజీ సీఎం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు.. బాధితురాలి తల్లి ఆరోపించారు.

Yeddyurappa sexually assaulted the girl 2

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేత యడియూరప్పపై ఇలాంటి ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది కాంగ్రెస్‌ పార్టీకి మంచి అస్త్రంగా పనికి వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకలు. మరి దీనిపై బీజేపీ, యడియూరప్ప ఎలా స్పందిస్తారు.. తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి.

ఇక యడియూరప్ప 2008-2011 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018లో కొద్ది రోజుల పాటు, ఆ తర్వాత జూలై 2019-2021 మధ్య మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి జూలై 2021లో బస్వరాజ్ బొమ్మైని సీఎంగా చేసింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి, బీజేపీని ఓడించింది.