iDreamPost
android-app
ios-app

ఘోర ప్రమాదం, లోయలో పడిన ట్రక్.. 19 మంది దుర్మరణం!

  • Published May 21, 2024 | 10:09 AM Updated Updated May 21, 2024 | 10:09 AM

Road Accident: ఉదయం లేచిన మొదలు ఇంటికి వచ్చి పడుకునే వారకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూస్తే ప్రజల్లో వణుకు పుడుతుంది.. బయటికి వచ్చిన వాళ్లు క్షేమంగా ఇంటికి వెళ్తామా అన్న భయం పట్టుకుంది.

Road Accident: ఉదయం లేచిన మొదలు ఇంటికి వచ్చి పడుకునే వారకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూస్తే ప్రజల్లో వణుకు పుడుతుంది.. బయటికి వచ్చిన వాళ్లు క్షేమంగా ఇంటికి వెళ్తామా అన్న భయం పట్టుకుంది.

  • Published May 21, 2024 | 10:09 AMUpdated May 21, 2024 | 10:09 AM
ఘోర ప్రమాదం, లోయలో పడిన ట్రక్.. 19 మంది దుర్మరణం!

దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రెప్పపాటున జరుగుతున్న ఈ ప్రమాదాల్లో ఎంతోమంది మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. వేల మంది అనాథలుగా మిగిలిపోతున్నారు.. అంగవైకల్యంతో బాధపడుతున్నారు. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి. నిద్ర మత్తు, అవగాహన లేమి, అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తులో ఉండి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. చత్తీస్ గఢ్ లో ఓ బస్సు లోయలో పడిపోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

చత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కబీర్ ధామ్ లో ట్రక్ లోయలో పడిపోయి 19 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 17 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. పికప్ ట్రక్ లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కంచుకోవడం వల్ల అదుపు తప్పి 20 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెమ్‌రా గ్రామానికి చెందిన 48 మంది గిరిజనులు సమీప అటవీ ప్రాంతానికి బీడీ ఆకులు సేకరించేందుకు పికప్ ట్రక్ లో వెళ్లారు. తిరిగి అదే వాహనంలో మధ్యాహ్నం బీడీ ఆకుల మూటలతో తిరిగి వస్తున్నారు. అప్పటికే ఆ ట్రక్కు కిక్కిరిపోయింది.

బహపాని గ్రామ సమీపంలో ఓ మూలమలుపు వద్ద డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేకపోయాడు. అప్పటికే మంచి స్పీడ్ మీద ఉన్నాడు డ్రైవర్.  దీంతో ట్రక్కు అదుపు తప్పి సుమారు 20 అడుగులు ఉన్న లోయలో పడిపోయింది. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ట్రక్కు అదుపు తప్పిందని ప్రత్యేక్ష సాక్షులు అంటున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం భీతావహ వాతావరణంగా మారింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి జిల్లా యంత్రాన్ని ఆదేశించారు.