iDreamPost
android-app
ios-app

పాడు పని చేస్తూ దొరికిపోయిన 13 మంది యువతీ, యువకులు

నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతీ యువకులు పాడు పనులు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బంగ్లాను అద్దెకు తీసుకుని అసాంఘిక చర్యలకు పాల్పడుతుండటంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతీ యువకులు పాడు పనులు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బంగ్లాను అద్దెకు తీసుకుని అసాంఘిక చర్యలకు పాల్పడుతుండటంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

పాడు పని చేస్తూ దొరికిపోయిన 13 మంది యువతీ, యువకులు

ఇదిగో ఈ ఫోటోలో ముసుగులు ధరించిన యువకులు..పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్లు. కానీ చెత్త పనులతో పోలీసుల పుటలకు ఎక్కారు. విల్లాలను అద్దెకు తీసుకుని అమ్మాయిలతో పాడు పనులు చేయిస్తున్నారు. చాటు మాటు వ్యవహారాలు చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. కానీ అన్ని వేళలా ఆటలు సాగవు కదా.. వీరి చీకటి వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం అందింది. అక్కడేదే ఇల్లీగల్ బిజినెస్ జరగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని చూడగా.. విస్తుపోవడం పోలీసుల వంతు అయ్యింది. ఒక్కరు కాదు 13 మందిని యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకు వీళ్లు చేస్తున్న ఘన కార్యం ఏంటేంటే.. పోర్న్ చిత్రాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఘటన పూణెలోని లోనావాలాలో జరిగింది. పోర్న్ వీడియో రాకెట్‌ను పోలీసులు చేధించారు. కొన్ని బంగ్లాలు అద్దెకు తీసుకుని అశ్లీల చిత్రాలను నిర్మిస్తూ వ్యాపారం చేస్తున్నారు. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లతో పాటు కొన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఉద్దేశించిన అశ్లీల కంటెంట్‌ను తెరకెక్కిస్తోంది ఓ ముఠా. దీనికి సంబంధించిన వీడియో పోలీసుల చేతికి రావడంతో పాటు స్థానికులు అందించిన సమాచారంతో ఆ గృహాలపై దాడులు నిర్వహించారు. 13 మందిని పట్టుకున్నారు. మొత్తంగా 15 మంది యువకులు ఉన్నట్లు గుర్తించారు. అనేక రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇక్కడకు వచ్చినట్లు సమాచారం.

వాళ్లు అక్కడకు వెళ్లే సమయానికి అడల్ట్ వీడియో షూటింగ్ జరుగుతోందని గమనించారు. పోలీసులు రాకతో ఒక్కసారిగా పరుగులు పెట్టారు యువతీ యువకులు కొంత మంది అశ్లీల పరిస్థితుల్లో కనిపించారు. అప్పటి వరకు చిత్రీకరించిన వీడియో ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో పాటు కెమెరాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అడల్ట్ వీడియోలు లేదా అడల్ట్ ఫిల్మ్‌ల నిర్మాణం దేశంలో నిషేధం ఉన్నందున పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. ఈ 13 మందిలో ఐదుగురు యువతులను కూడా ఉన్నారని, వారిని కూడా అదుపులోకి తీసుకున్నామని, వారిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. లోనావాలా సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్యసాయి కార్తీక్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది.