iDreamPost
android-app
ios-app

కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చిన స్నేహ! అసలేం జరిగిందంటే?

కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చిన స్నేహ! అసలేం జరిగిందంటే?

నేటి కాలం యువతి, యువకులు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు, మందలించారని, చదువులో రాణించలేకపోతున్నానని.., ఇలా అనేక రకాల కారణాలు చూపి చివరికి బలవన్మరణాలకు పాల్పడుతూ కన్నవాళ్లకు కడుపుకోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. అయితే అచ్చం ఇలాంగే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ గోల హనుమాన్ ప్రాంతానికి చెందిన స్నేహతివారి (18) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. ఈ యువతి ఆర్మూర్ లోని ఓ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే కాలేజీలో సోఫియన్ అనే తోటి విద్యార్థి స్నేహతో పరిచయం పెంచుకున్నాడు. రోజూ కలిసి మాట్లాడేవాడు. క్లాస్ మెట్ కావడంతో స్నేహ అతనితో మాట్లాడుతూ వచ్చింది. దీన్నే ఆసరాగా ములుచుకున్న ఇతగాడు.. స్నేహను ప్రేమించాలని వెంటపడ్డాడు. దీనికి ఆ యువతి నిరాకరించింది. అయినా వదలని ఈ దుర్మార్గుడు… రోజూ ఫోన్లు చేస్తూ వేధించేవాడు. ఇక స్నేహ ఇదే విషయాన్ని ఇటీవల తన తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వాళ్లు సోఫియన్ కు వార్నింగ ఇచ్చారు. అయినా వెనక్కి తగ్గని సోఫియన్.. ప్రేమించాల్సిందే అంటూ ఆ యువతిని బెదించాడు.

ఇక ఇతని వేధింపులను తట్టుకోలేకపోయిన స్నేహ.. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తమ్ముడు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఇంటికి చేరుకుని కూతురుని అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు.. సోఫియాన్ గత కొంత కాలంగా మా కూతురిని ప్రేమ పేరుతో టార్చర్ చేశాడని, ఇతని వేధింపులు భరించలేక స్నేహ ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet