iDreamPost
android-app
ios-app

బడిలోనే బాలికపై అత్యాచారం! లేడీ టీచర్‌ సహకారంతో స్కూల్‌ డైరెక్టర్‌ కుమారుడి దారుణం

  • Published Sep 07, 2023 | 11:04 AM Updated Updated Sep 07, 2023 | 11:04 AM
  • Published Sep 07, 2023 | 11:04 AMUpdated Sep 07, 2023 | 11:04 AM
బడిలోనే బాలికపై అత్యాచారం! లేడీ టీచర్‌ సహకారంతో స్కూల్‌ డైరెక్టర్‌ కుమారుడి దారుణం

చాలా మంచి స్కూల్‌ అని లక్షల్లో ఫీజులు కట్టి.. చిన్నారిని స్కూల్‌లో జాయిన్‌ చేశారు. బాగా చదువుకుని, మంచి మార్కులతో బయటికి వస్తుందనుకుంటే.. డిప్రెషన్‌తో ఆస్పత్రి పాలైంది ఓ చిన్నారి. ఆస్పత్రిలో చేర్చి, సైక్రియార్టిస్ట్‌కి చూపించిన తర్వాత జరిగిన దారుణం బయటపడింది. ఆ స్కూల్‌ డైరెక్టర్‌ కుమారుడి చేతిలో రెండేళ్లుగా అత్యాచారానికి గురవుతూ.. తనపై జరుగుతున్న దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుంగిపోయి.. చివరికి తీవ్ర మానసిన వ్యధతో ఆస్పత్రి పాలైంది. పైగా ఈ దారుణానికి ఆ స్కూల్‌ లేడీ ప్రిన్సిపాల్‌ సహకారం ఉండటం సిగ్గుచేటు. కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన బిహార్‌లోని సహర్సా జిల్లాలో చోటు చేసుకుంది.

ఓ ప్రవేట్‌ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న బాలికపై ఆ స్కూల్‌ డైరెక్టర్‌ కుమారుడు సామ్రాట్ విశ్వాస్ అలియాస్‌ సుమీత్ విశ్వాస్ 2017 నుంచి 2019 వరకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనపై జరిగిన దారుణంతో ఏళ్లుగా తనలో తాను కుంగిపోతున్న బాలిక తీవ్ర డిప్రెషన్‌తో స్కూల్‌ హాస్టల్‌లో స్పృహా కోల్పోవడంతో హాస్టల్‌ వార్డెన్‌ ఆస్పత్రిలో చేర్పించడంతో అసలు విషయం బయటపడింది. ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు, ఆమె తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతుందని, సైక్రియార్టిస్ట్‌ వద్దకు పంపించారు. ఆ మానసిక వైద్యనిపుణులు చిన్నారిని సాధారణ స్థితికి తేవడంతో ఆమెపై జరిగిన దారుణం వెలుగుచూసింది.

సుమీత్‌ విశ్వాస్‌.. ఓ ప్రముఖ స్కూల్‌ డైరెక్టర్‌ కుమారుడు. నిత్యం ఆ స్కూల్‌లో చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వాడు. ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అనితా మిశ్రా ఆమెకు సహకరించేంది. తనపై జరిగిన దారుణం గురించి ఆ చిన్నారి మాటల్లో..‘2017లో నేను 6‍వ గ్రేడ్‌లో ఉన్నప్పుడు ఓ రోజు అనితా మేడమ్‌ వచ్చి నన్ను స్కూల్‌లో ఉన్న ఓ ఖాళీ రూమ్‌కు తీసుకెళ్లి, లైట్లు ఆఫ్‌ చేసి, బయట నుంచి తలుపులు వేశారు. అప్పటికే ఆ రూమ్‌లో విశ్వాస్‌ అన్న ఉన్నాడు. తను నా దగ్గరికి వచ్చి.. ఎక్కడెక్కడో తాకుతున్నాడు. అతను అలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. తర్వాత నా డ్రెస్‌ తీసేసి.. నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా అనేక సార్లు చేశాడు. వీడియో తీసి.. ఈ విషయం ఎవరికైనా చెప్పావో.. నేను నిన్ను ఇలా చేశానని అందరికీ చెప్తా, వీడియో వైరల్‌ చేస్తా అని భయపెట్టేవాడు. పేరెంట్స్‌కి చెబితే నిన్ను స్కూల్‌ మాన్పించేస్తారని చెప్పేవాడు. నన్నే కాదు నాలానే చాలా మందిని అనితా మేడమ్‌ అలా రూమ్‌లోకి తీసుకెళ్లేవారు.’ అని చిన్నారి తనపై జరిగిన దారుణం గురించి వెల్లడించింది.

ఆస్ప్రతిలో సైక్రియార్టిస్ట్‌ పర్యవేక్షణలో ఉన్న సమయంలో.. చిన్నారి మెల్లమెల్లగా తనపై జరిగిన దారుణంగా గురించి వెల్లడించింది. కొన్ని సార్లు నిద్రలో భయంతో వణికిపోతూ.. ‘ప్లీజ్‌ మేడమ్‌ నన్ను వదిలేయండి, నన్ను తీసుకెళ్లకండి, అన్నా.. ప్లీజ్‌ అన్న నన్ను వదిలేయ్‌’ అంటూ ఏడ్చేదని చిన్నారి కుటుంబ సభ్యులు, వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై చిన్నారి సోదరుడు మునవ్వర్‌ మాట్లాడుతూ.. ‘మేము చాలా తప్పు చేశాం. తనను మేం పట్టించుకోలేదు. తను మౌనంగా ఉంటే ఎందుకు అలా ఉంటున్నావ్‌ అని అడగలేదు. తన ప్రవర్తన ఎందుకలా ఉందో గుర్తించి ఉంటే.. ఇన్నేళ్లు తనలో తాను అనుభవిస్తున్న ఈ మానసిక క్షోభ గురించి మాకు తెలిసేది. 2019 తర్వాత తను మమ్మల్ని అడిగింది ఒక్కటే.. స్కూల్‌ మార్చమని కోరింది. దాంతో మేము స్కూల్‌ మార్చాం. కానీ, తన ఇంకా అదే మానసిక వ్యధను అనుభవిస్తూనే ఉంది. ఈ దారుణానికి పాల్పడిన విశ్వాస్‌ను వదిలిపెట్టం. చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకుంటాం’ అంటూ మునవ్వర్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

లక్షల్లో ఫీజులు కట్టేసి.. పెద్ద పేరున్న స్కూల​్‌లో పిల్లల్ని జాయిన్‌ చేసి.. తమ పని అయిపోయిందని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. కానీ, కొన్ని మానవ మృగాలు ఆ అద్దాల​ మేడల చీకటి గదుల్లో చేసే దారుణాలతో చిన్నారుల జీవితాలు చితికిపోతాయి. ఎంత మంచి స్కూల్‌లో చేర్చినా.. పిల్లలతో నిత్యం మాట్లాడటం, వారి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచడం ఎంతో అవసరం. వారితో తల్లిదండ్రుల మాట్లాడితేనే వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో? వారి చుట్టూ ఏం జరుగుతుందో తెలిసేది. లేదంటే వారిలో వారు మాసిసిక క్షోభ అనుభవిస్తూ.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఎంత ఏడ్చినా వారిని మామూలు స్థితికి తేవడం చాలా కష్టం. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: దారుణం: ప్రిన్సిపాల్ అరాచకం.. ప్రమోషన్స్ ఆశ చూపి మహిళా టీచర్లపై..!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet