Dharani
లవర్స్ ఇద్దరూ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేద్దామని భావిస్తే.. ఊహించని సంఘటన చోటు చేసుకుని వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఆ వివరాలు..
లవర్స్ ఇద్దరూ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేద్దామని భావిస్తే.. ఊహించని సంఘటన చోటు చేసుకుని వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఆ వివరాలు..
Dharani
వారిద్దరికి స్కూల్ డేస్‌లోనే పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ఉన్నత విద్య కోసం వేర్వేరు కాలేజీల్లో చేరారు. అయతే సమయం దొరికిన ప్రతి సారి కలుసుకునేవారు. ఈ క్రమంలో తాజాగా రెండు రోజుల క్రితం లవర్స్ ఇద్దరూ కలుసుకున్నారు. వీరిద్దరికి మద్యం, డ్రగ్స్ అలవాటు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ కలుసుకున్న సమయంలో డ్రింక్ చేశారు. ఆ తర్వాత సమీపంలోకి అడవికి వెళ్లారు. అక్కడ కూడా మందు తాగి ఎంజాయ్ చేశారు. ఇక తెల్లారిలేచి చూసేసరికి.. ప్రియురాలు చనిపోయింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
చనిపోయిన యువతిని రితి ఏంజెల్‌గా గుర్తించారు. ఊటీలో పింగార్ ప్రాంతానికి చెందిన రితికి అక్కడే ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదివే సమయంలో ఆకాశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడిది ఊటి, నీలగిరి జిల్లా. ఆకాష్ తల్లిదండ్రులు విడిపోవడంతో.. అతడు తన అమ్మమ్మ దగ్గర ఉంటూ.. రితి చదివే స్కూల్లోనే చదువుకునేవాడు. అలా వారి ఇద్దరికి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
పాఠశాల విద్య అయిపోయిన తర్వాత రితి కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో జాయిన్ అయ్యింది. ఆకాష్ నీలగిరిలోనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. సెలవుల సమయంలో వారిద్దరూ కలుసుకునేవారు. ఈ క్రమంలో శనివారం కాలేజీకి సెలవు ఉండటంతో.. రితిని నీలగిరి రావాల్సిందిగా కోరాడు ఆకాష్. ఆమె వచ్చాక వారిద్దరూ బైక్ మీద బార్ షాప్‌కి వెళ్లి మద్యం కొనుక్కుని.. ఆకాష్ ఇంటికి వెళ్లారు.
మందు తాగాకా.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆకాష్ ఇంటికి సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లారు. అక్కడ వారిద్దరూ మ్యాజిక్ మష్రూమ్ అనే విషపూరిత పుట్టగొడుగులు తిన్నారు. ఆతర్వాత కళ్లు తిరిగినట్లు అనిపించడంతో.. ఇంటికి వచ్చి పడుకున్నారు. ఉదయం నిద్ర లేచిన ఆకాష్.. రితి ఇంకా లేవకపోవడం చూసి షాక్ అయ్యాడు. ఆమెని నిద్ర లేపడానికి ప్రయత్నించాడు. కానీ ఆమెలో ఎలాంటి చలనం లేదు. దాంతో భయం వేసి అంబులెన్స్‌కి కాల్ చేశాడు.
వారు ఆకాష్ ఇంటికి వచ్చి రితిని పరీక్షించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. అదే విషయం ఆకాష్‌కి తెలిపారు. దాంతో అతడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆకాష్ ఇంటికి చేరుకుని.. రితి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఊటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అనుమానానస్పద మృతిగా కేసు నమోదు చేసి.. ఆకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.