P Venkatesh
పెళ్లైన రెండు వారాలకే ఘోరం జరిగిపోయింది. జీవితంపై ఎన్నో ఆశలతో వివాహబంధంలోకి అడుగుపెట్టిన వారు విధి చేతిలో ఓడిపోయారు. అసలు ఏం జరిగిందంటే?
పెళ్లైన రెండు వారాలకే ఘోరం జరిగిపోయింది. జీవితంపై ఎన్నో ఆశలతో వివాహబంధంలోకి అడుగుపెట్టిన వారు విధి చేతిలో ఓడిపోయారు. అసలు ఏం జరిగిందంటే?
P Venkatesh
ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జీవితంపై ఎన్నో కలలుకన్నారు. కానీ వారి సంతోషం ఎన్నో రోజులు నిలబడలేదు. విధి వారిని వెంటాడింది. పెళ్లైన రెండు వారాలకే ఘోరం చోటుచేసుకున్నది. ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేము. అప్పటి వరకు సంతోషంగా గడిపినవారు తిరిగిరాని లోకాలకు వెల్లడంతో కుటుంబ సభ్యలు తీవ్ర శోకంలో మునిగిపోతారు. ఇదే విధంగా రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొత్తగా పెళ్ళైయిన జంట బామ్మర్ది తో కలిసి బైకుపై అత్తగారింటికి బయల్దేరారు. అలా వెళ్లున్న క్రమంలో మార్గమధ్యలో ఎదురెదురుగా కారు ఢీకొనడంతో కొత్త పెళ్లికొడుకు చందు(26) మృతి చెందాడు. పెళ్లి కూతురు విజ్జు (18) బామ్మర్ది పరశురాం (24) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర సరిహద్దు కృష్ణా మండలంలోని సరిహద్దులోని కర్ణాటక సైదాపూర్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగింది.
తీవ్రంగా గాయపడిన కొత్త పెళ్లి కూతురు విజ్జు కోమాలోకి వెళ్ళగా, పరుశురాం తీవ్ర గాయాలతో సైదాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మక్తల్ మండలంలోని ముష్ఠిపల్లి గ్రామానికి చెందిన చందు కర్ణాటకలోని సైదాపూర్ తాలూకా యాదగిరి నుండి రాయచూర్ వైపు వెళ్ళుతున్న కారు వీరి బైకును సైదాపూర్ గ్రామ శివారులో ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే చందు మృతి చెందాడు. విజయలక్ష్మి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది.
బామ్మర్ది పరుశురాం తీవ్ర గాయాలతో సైదాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సైదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో కడెచూరు, ముష్టిపల్లి గ్రామాల్లోనూ విషాదఛాయలు నెలకొన్నాయి. ఇరు కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. పెళ్ళైన రెండు వారాలకే రోడ్డు ప్రమాదం జరగడం భర్త చనిపోవడం భార్య కోమాలోకి వెళ్ళడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.