nagidream
New Twist In Muchupalli Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. మొదట అమ్మాయిని చంపి నదిలో పడేశామని.. ఆ తర్వాత పూడ్చి పెట్టామని చెప్పారు. కానీ పోలీసులు అణువణువునా వెతికినా కూడా అమ్మాయి మృతదేహం దొరకలేదు. ఈ నేపథ్యంలో బాలిక హత్య వెనుక క్షుద్రపూజలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
New Twist In Muchupalli Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. మొదట అమ్మాయిని చంపి నదిలో పడేశామని.. ఆ తర్వాత పూడ్చి పెట్టామని చెప్పారు. కానీ పోలీసులు అణువణువునా వెతికినా కూడా అమ్మాయి మృతదేహం దొరకలేదు. ఈ నేపథ్యంలో బాలిక హత్య వెనుక క్షుద్రపూజలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
nagidream
ముచ్చుమర్రి బాలిక కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. సినిమాని మించిన ట్విస్టులు నెలకొంటున్నాయి. అమ్మాయి మిస్ అయ్యింది అనుకుంటే ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పారు. హత్య అనంతరం బాలికను ముచ్చుమర్రి సమీపంలోని నదిలో పడేశామని చెప్పారు. వీళ్ళ మాటలు నమ్మి పోలీసులు నాలుగు రోజుల పాటు కాలువలో వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడా కూడా కనిపించలేదు. మళ్ళీ ముగ్గురు మైనర్ బాలురిని విచారించగా నదిలో పడేయలేదు పూడ్చిపెట్టామని చెప్పారు. పగిడ్యాల సమాధి, ముచ్చుమర్రి సమాధి వద్ద మొత్తం వెతికారు. బాలిక మృతదేహం కనిపించలేదు సరికదా కనీసం ఆ ఆనవాళ్లు కూడా కనిపించలేదు.
దీంతో పోలీసులకు ఆ ముగ్గురు బాలురు అబద్ధం చెప్తున్నారేమో అని.. వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా బాలికపై క్షుద్రపూజలు చేశారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పలు మీడియాల్లో దీనికి సంబంధించి కథనాలు కూడా వస్తున్నాయి. బాలికను హత్య చేసిన స్థలంలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించాయని.. హత్య వెనుక క్షుద్రపూజలు ఉన్నాయన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో మట్టి బొమ్మ, నిమ్మకాయలు ఉన్నాయి. క్షుద్రపూజలు చేసి బాలికను నరబలి ఇచ్చారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారం చేయకుండా బాలురుతో అబద్ధం చెప్పిస్తున్నారా? దీని వెనుక పెద్దల హస్తం ఉందా? పిల్లలకంటే జువైనల్ కేసు కింద శిక్ష పడదు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళని ఈ కేసులో భాగం చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాలిక హత్య వెనుక క్షుద్రపూజలు జరిగాయన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పలు మీడియాల్లో కూడా కథనాలు వస్తున్నాయి. అయితే ఏది నిజం అనేది పోలీసులు నిర్ధారిస్తేనే గానీ తెలియదు. కథనాలు, ఊహాగానాలు అనేవి నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా నిజం అని నిర్ధారించడానికి లేదు. ఈ విషయంలో పోలీసులు వీలైనంత త్వరగా కేసుని చేధిస్తే అసలు నిజాలు బయటపడతాయి. పోలీసులు కూడా కేసును సీరియస్ గానే తీసుకున్నారు. ఈ విషయంలో అందరూ పోలీసులకు సహకరించాలి. నిందిత బాలురు బాలికను నదిలో పడేశారా? పూడ్చి పెట్టారా? నరబ*లి ఇచ్చారా? లేక మృతదేహాన్ని దొరక్కుండా వేరే చోటకు తరలించారా? లాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు దొరుకుతాయి. అప్పటి వరకూ కేసుని గందరగోళానికి గురి చేయకుండా పోలీసులు చెప్పే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.