iDreamPost
android-app
ios-app

ముచ్చుమర్రి బాలిక కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ

  • Published Jul 16, 2024 | 8:13 PM Updated Updated Jul 16, 2024 | 8:19 PM

Nandyala SP Revealed Sensational Matters Regarding Muchumarri Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి సంచలన నిజాలు బయట పడ్డాయి. నంద్యాల ఎస్పీ ఆదిరాజ్ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు.

Nandyala SP Revealed Sensational Matters Regarding Muchumarri Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి సంచలన నిజాలు బయట పడ్డాయి. నంద్యాల ఎస్పీ ఆదిరాజ్ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు.

ముచ్చుమర్రి బాలిక కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి మండలంలోని బాలిక హత్యాచారం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ముగ్గురు మైనర్ బాలురు ఒంటరిగా పార్క్ లో ఆడుకుంటున్న బాలికను బలవంతంగా ఒక చోటకు ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు. ఆపై హత్య చేశారు. అయితే నదిలో పడేశామని.. పూడ్చిపెట్టామని చెప్తూ వచ్చారు. కానీ అసలు బాలిక మృతదేహాన్ని ఏం చేశారు అనేది మాత్రం మిస్టరీగానే ఉంది. ఎట్టకేలకు ఈ కేసులో బాలిక మృతదేహాన్ని ఏం చేశారో తమ విచారణలో బాలురు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. ముగ్గురు మైనర్ బాలురు చేసింది కాదని.. వీరి వెనుక మరో ఇద్దరు ఉన్నారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితులు ముగ్గురు కాదు.. ఐదుగురని అన్నారు.   

ముచ్చుమర్రి బాలిక కేసులో మిస్టరీ వీడింది. బాలికను అత్యాచారం చేసిన బాలురు మొదట నదిలో పడేశామని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చి సమాధిలో పూడ్చామని చెప్పారు. మరోవైపు కేసు డైవర్ట్ చేయడానికి క్షుద్రపూజలు చేసి నరబలి ఇచ్చారు అనేలా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బాలిక మృతదేహాన్ని ఏం చేశారు అన్న విషయంలో ఒక మిస్టరీ నెలకొంది. తాజాగా దీనికి సంబంధించి మిస్టరీ వీడింది. బాలిక కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు నంద్యాల ఎస్పీ ఆదిరాజ్.  బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేశారని.. అత్యాచారం తర్వాత బాలికను గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడించారు. ముందు బాలిక మృతదేహాన్ని కేసీ కెనాల్ పక్కన పడేశారని.. ఆ తర్వాత ఇంటికి వెళ్లి బంధువులకు జరిగింది చెప్పారని అన్నారు. ఇద్దరు బంధువులు మైనర్లకు సహాయం చేశారని ఎస్పీ తెలిపారు. బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్ లో పడేశారని ఎస్పీ ఆదిరాజ్ వెల్లడించారు.

ముగ్గురు మైనర్ బాలురు మీద ఏ1, ఏ2, ఏ3 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని.. వీరికి సహకరించిన ఇద్దరి బంధువుల మీద ఏ4, ఏ5 కేసులు వేసి అరెస్ట్ చేశామని అన్నారు. గర్ల్ మిస్సింగ్ కేసు నుంచి ఈ కేసుని గ్యాంగ్ రేప్, మర్డర్, పోక్సో యాక్ట్ కింద మారుస్తామని అన్నారు. ఇంకా బాలిక మృతదేహం దొరకలేదని.. శ్రీశైలం రిజర్వాయర్ లో గాలిస్తున్నామని అన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్కూబా డైవర్స్ వచ్చారని.. కొత్త టెక్నాలజీతో, డ్రోన్ కెమెరాలు, అండర్ వాటర్ స్కానర్ల సహాయంతో బాలిక మృతదేహాన్ని వెతుకుతున్నారని అన్నారు. డాగ్ స్క్వాడ్స్, టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారని.. బాలిక మృతదేహాన్ని కనిపెడతామని అన్నారు. బాలిక మృతదేహం దొరికేవరకూ గాలింపు చర్యలు కొనసాగుతాయని ఎస్పీ వెల్లడించారు.