iDreamPost
android-app
ios-app

దిండు కింద కొడవలి.. భార్య పుట్టింటికి వెళ్లగానే..

  • Published Jul 17, 2023 | 11:44 AM Updated Updated Jul 17, 2023 | 11:44 AM
  • Published Jul 17, 2023 | 11:44 AMUpdated Jul 17, 2023 | 11:44 AM
దిండు కింద కొడవలి.. భార్య పుట్టింటికి వెళ్లగానే..

భార్యాభర్తల బంధాలు ఈ మధ్యకాలంలో చాలా బలహీనపడుతున్నాయి. కేవలం అవసరాల కోసమే అన్నట్లుగా మారుతున్నాయి. నిత్యం గొడవలు పడుతూ కాపురం చేస్తున్న వారు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్సుల జీవితాన్ని సాగిస్తున్నారు. గొడవలు పెరిగిన రోజు.. హత్యలో.. ఆత్మహత్యలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, పుట్టింటికి వెళ్లిన భార్యపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కొడవలితో దారుణంగా నరికి చంపాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాండ్య జిల్లా గుండ్లుపేటే తాలూకా బేరంబళ్లికి చెందిన మాదేశ అనే వ్యక్తికి.. పాండవపుర తాలూకాలోని చినకురళి గ్రామానికి చెందిన హర్షిత అనే అమ్మాయితో ఏడాది క్రితం పెళ్లయింది. పెళ్లయి కొత్తలో వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి గొడవలు జరగటం మొదలైంది. ప్రతి నిత్యం ఇద్దరూ గొడవలు పడుతూ ఉండేవారు. మాదేశ పడుకునే సమయంలో దిండు కింద కొడవలి పెట్టుకుని పడుకునే వాడు. దీంతో హర్షిత భయపడుతూ ఉండేది.

ఏ సమయంలో తనపై దాడి చేస్తాడో తెలియక నిద్రలేని రాత్రులు గడిపేది. భర్త చేసే పనులు తట్టుకోలేక తరుచుగా పుట్టింటికి వెళ్లేది. మాదేశ బతిమాలి మరీ ఇంటికి తెచ్చుకునేవాడు. అయినా అతడిలో మార్పు వచ్చేది కాదు. కొద్దిరోజుల క్రితం కూడా ఇద్దరి మధ్యా గొడవలు జరిగాయి. దీంతో హర్షిత పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ ఇంటికి రాకపోవటంతో మాదేశ ఆదివారం అత్తింటికి వెళ్లాడు. అక్కడ భార్యతో గొడవపడ్డాడు. వేట కొడవలితో ఆమెను నరికి చంపాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  మాదేశను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Jojobet GirişJojobetcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom