iDreamPost
android-app
ios-app

బయటపడ్డ భర్త నిజ స్వరూపం.. అతడి పాడు పనులు తట్టుకోలేక..

  • Published Aug 08, 2023 | 9:31 AM Updated Updated Aug 08, 2023 | 9:31 AM
  • Published Aug 08, 2023 | 9:31 AMUpdated Aug 08, 2023 | 9:31 AM
బయటపడ్డ భర్త నిజ స్వరూపం.. అతడి పాడు పనులు తట్టుకోలేక..

భరించాల్సిన భర్తే ఆమె పాలిట శాపంగా మారాడు. పెళ్లయిన రెండేళ్లకే తన నిజ స్వరూపం బయటపెట్టాడు. మానసికంగా, శారీరకంగా ఆమెను హింసించాడు. ఏకంగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎంత చెప్పినా ఆమె మాట వినలేదు. దీంతో ఆ ఇళ్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, మైసూరు జిల్లా, కుళ్లనకుప్పలు గ్రామానికి చెందిన మనురాణికి పొరుగు గ్రామం హనుమనహాళుకు చెందిన మంజు అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం పెళ్లయింది.

పెళ్లయిన కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి కాపురంలో గొడవలు జరగుతూ వచ్చాయి. మంజు.. మనురాణిని మానసికంగా, శారీరకంగా బాగా హింసించేవాడు. మనురాణి తన బాధను తల్లిదండ్రులతో చెప్పుకునేది. వ్యవసాయం చేసుకుంటూ తమ కూతుర్ని బాగా చూసుకుంటాడనుకున్న అల్లుడి నిజ స్వరూపం బయటపడటంతో వారు గిలగిల్లాడిపోయారు. ఈ నేపథ్యంలోనే మనురాణికి ఓ షాకింగ్‌ విషయం తెలిసింది. మంజు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని తేలింది.

దీంతో ఈ విషయమై భర్తతో గొడవపడింది. అక్రమ సంబంధం మానుకోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ తరచుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఎంత చెప్పినా మంజు, మనురాణి మాట వినలేదు. కట్టుకున్న భార్య కంటే.. ప్రియురాలే ముఖ్యం అనుకున్నాడు. భర్త ప్రవర్తనతో మనురాణి విసిగిపోయింది. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. వారు పెద్ద మనుషుల దగ్గర పంచాయితీ పెట్టారు. అయినా.. మంజులో మార్పురాలేదు. భర్తలో మార్పు రాకపోవటంతో మనురాణి తీవ్ర మనస్తాపానికి గురైంది.

తాను బతికి ఉండటం కంటే చనిపోవటం మేలని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మనురాణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మనురాణి తల్లిదండ్రులు అల్లుడిపై కేసు పెట్టారు. అల్లుడే తమ కూతురికి విషం ఇచ్చి చంపేశాడని వారు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetgrandpashabetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş