Uppula Naresh
ఓ దంపతులు ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టారు. కేవలం డ్రగ్స్ కు అలవాటు పడి కన్న పిల్లలను అమ్ముకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ దంపతులు ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టారు. కేవలం డ్రగ్స్ కు అలవాటు పడి కన్న పిల్లలను అమ్ముకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Uppula Naresh
సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం తోడబుట్టినవాళ్లను, కన్న వాళ్లను ఎలా తేడా లేకుండా అందరినీ హత్య చేస్తున్నారు. ఇక ఇంతటితో సరి పెడుతున్నారా అంటే అదీ లేదు. హత్య చేసి ఆ తర్వాత సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ చోట దారుణం చోటు చేసుకుంది. ఓ దంపతులు వ్యసనాలకు బానిసై ఎవరూ ఊహించని కిరాతకానికి పాల్పడ్డారు. డ్రగ్స్ కోసం ఏకంగా కన్న పిల్లలను అమ్మేశారు. అవును, మీరు విన్నది నిజమే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఇదేం దారుణం అంటూ షాక్ కు గురవుతున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలోని అంధేరి ప్రాంతంలో షబ్బీర్ ఖాన్-సానియా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అలా చాలా కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ భార్యాభర్తలు డ్రగ్స్ కు బానిసయ్యారు. రోజూ ఇది లేకపోతే వారికి ఏం అర్థం అయ్యేది కాదని స్థానికులు చెబుతున్నారు. ఇక డ్రగ్స్ కొనడానికి వీరి వద్ద డబ్బు లేకపోవడంతో వారికి ఏం చేయాలో తోచలేదు. ఈ క్రమంలో ఈ దంపతులు తమ పిల్లలను అమ్ముకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే.. మొదట రెండేళ్ల కుమారుడిని రూ.60 వేలకు అమ్మకానికి పెట్టారు.
ఆ తర్వాత నెల పసిబిడ్డను కూడా అమ్మాలనుకుని షకీల్ మక్రానీ అనే వ్యక్తికి రూ.14 వేలకు విక్రయించారు. అయితే షబ్బీర్ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో షాక్ కు గురయ్యారు. చేసేదేంలేక వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఈ దంపతులతో పాటు షకీల్ మక్రానీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక శుక్రవారం అమ్మేసిన చిన్న పాపను పోలీసులు ముంబైలోని ఓ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. కానీ, వీరి కుమారుడిని ఆచూకి దొరక లేదు. ఆ బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. డ్రగ్స్ కు బానిసై పిల్లలను అమ్ముకున్న ఈ దంపతుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.