iDreamPost
android-app
ios-app

మైనర్ అక్కాచెళ్లెల్లపై అఘాయిత్యం.. ఇద్దరూ గర్భం దాల్చడంతో..!

మైనర్ అక్కాచెళ్లెల్లపై అఘాయిత్యం.. ఇద్దరూ గర్భం దాల్చడంతో..!

ఎన్ని చర్యలు తీసుకున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఎన్ని కఠిన శిక్షలు విధించినా కొందరు మృగాళ్లలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా అభంశుభం తెలియని అమాయక అమ్మాయిలను బెదిరించి, భయపెట్టి లొంగదీసుకుని వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఇద్దరు మానవ మృగాలు మైనర్ అక్కాచెళ్లెల్ల జీవితాలతో ఆడుకున్నారు. వారిని లొంగదీసుకోవడమే కాకుండా.. గరభవతులను చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.

ఈ దారుణంగా రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లాలో జరిగింది. బాధితుల తండ్రి ఒక బ్రిక్స్ తయారీ కర్మాగారంలో పని చేస్తాడు. అక్కడే సప్పి, సుభన్ అనే ఇద్దరు యువకులు కూడా పనిచేస్తున్నారు. అయితే వీళ్ల కన్ను తమ కుమార్తెలపై పడిందని ఆ తండ్రి గమనించలేకపోయాడు. పెద్ద కుమార్తె(15) కడుపులో నొప్పిగా ఉందని చెప్పగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె 7.5 నెలల గర్భంతో ఉన్నట్లు తెలిపారు. అసలు ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆమెను నిలదీయగా అసలు జరిగిన విషయం చెప్పింది. సప్పి, సుభన్ తనపై కొన్నాళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్న విషయాన్ని వెల్లిడించింది. అయితే ఆమె తర్వాత చెప్పిన విషయం వారిని మంరిత షాక్ కు గురి చేసింది. అదేంటంటే వారి రెండో కుమార్తె(13)పై కూడా వాళ్లు లైగింక వింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ఆమెను పరీక్షించగా.. ఆమె 2 నెలల గర్భంతో ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం విన్న తల్లిదండ్రులకు ఏం అర్థం కాలేదు.

వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సప్పి, సుభన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి వైద్య పరీక్షల రిపోర్టులు పరిశీలించిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎవరినీ ఇంకా అరెస్టు చేయలేదు. ఇద్దరు పిల్లలను సప్పి, సుభన్ గ్యాంగ్ రే*ప్ చేసినట్లు పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఇద్దరు ఇప్పుడు గర్భవతులని పోలీసులు నిర్ధారించారు.  ఇద్దరు మృగాళ్లు బాధితుల తండ్రి పనిచేసే దగ్గరే పనిచేస్తారని తేల్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎందుకంటే వారు గర్భం దాల్చేవరకు కూడా అసలు ఏం జరుగుతోంది అనే విషయం బయటకు పొక్కలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ వారిని బెదిరించడంతో చేసేందేం లేక అమ్మాయిలు కూడా మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం పోలీసులకు విజ్ఞప్తి చేసింది.