iDreamPost
android-app
ios-app

పిల్లలతో కలిసి ఫంక్షన్ కు వెళ్లింది. కానీ, ఆ రోజు తిరిగి ఇంటికి రాలేదు!

ఈ మహిళకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఓ ఫంక్షన్ నిమిత్తం తన పిల్లలతో కలిసి స్కూటీపై హైదరాబాద్ కు వెళ్లింది. కానీ, ఆ రోజు తిరిగి ఇంటికి రాలేదు. అసలేం జరిగిందంటే?

ఈ మహిళకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఓ ఫంక్షన్ నిమిత్తం తన పిల్లలతో కలిసి స్కూటీపై హైదరాబాద్ కు వెళ్లింది. కానీ, ఆ రోజు తిరిగి ఇంటికి రాలేదు. అసలేం జరిగిందంటే?

పిల్లలతో కలిసి ఫంక్షన్ కు వెళ్లింది. కానీ, ఆ రోజు తిరిగి ఇంటికి రాలేదు!

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ మహిళ పేరు మలైక. ఈమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. ఇక కొన్నాళ్లకి వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ భార్యాభర్తలు ఆనందంగా గడిపారు. ఇదిలా ఉంటే.. ఈ మహిళ గత రెండు రోజుల కిందట తన పిల్లలతో కలిసి స్కూటీపై హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ కు వెళ్లింది. కానీ, ఆ రోజు బిడ్డలతో వెళ్లిన మలైక సాయంత్రమైన తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయం తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. కట్ చేస్తే.. ఓ గంట తర్వాత అసలు విషయం తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు మలైక ఫంక్షన్ వెళ్లి తిరిగి ఇంటికి ఎందుకు రాలేదు? అసలు ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రాంనగర్ కు చెందిన మహ్మద్ అహ్మద్ అనే వ్యక్తికి మలైక (30) అనే కూతురు ఉంది. ఆమెకు గతంలో పెళ్లై ఇద్దరు కుమార్తెలు, ఓ కమారుడు జన్మించాడు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజుల కిందట మలైక ఓ శుభకార్యం నిమిత్తం తన పిల్లలతో కలిసి స్కూటీపై హైదరాబాద్ లోని బాబాగూడాకు బయలు దేరింది. ఇక ఆ రోజు ఫంక్షన్ ముగించుకుని మలైక స్కూటీపై పిల్లలతో తిరుగు ప్రయాణమైంది. ఇక మనోహరాబాద్ కాళ్లకల్ శివారు జాతీయ రహదారిపై వెళ్తుండగా ఆమె వాహనాన్ని వెనకాల నుంచి ఓ లారీ ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో మలైక, కూతురు, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఓ కుమార్తె ప్రాణాలతో బయటపడింది.

వెంటనే స్పందించిన వాహన దారులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఉన్నట్టుండి మలైక, ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో ఆమె ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, మలైక మృతి చెందిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి