ఆటో కోసం ఆశపడి.. బాంబులు పెట్టిన డబ్బాపై కూర్చుంటే.. చివరకు

మనిషికి ఆశ ఉండాలి. కానీ, అత్యాషకు పోతే ప్రాణాలు కూడా పోతాయి. ఇదే విధంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆటో కోసం ఆశపడి బాంబులు పెట్టిన డబ్బాపై కూర్చుని మరణించాడు.

మనిషికి ఆశ ఉండాలి. కానీ, అత్యాషకు పోతే ప్రాణాలు కూడా పోతాయి. ఇదే విధంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆటో కోసం ఆశపడి బాంబులు పెట్టిన డబ్బాపై కూర్చుని మరణించాడు.

దేశ వ్యాప్తంగా దీపావళి పండగ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. దీపావళికి పిల్లలు, పెద్దలు అంతా కలిసి బాణాసంచా, క్రాకర్స్ కాల్చుతుంటారు. పట్నం, పల్లె అనే తేడా లేకుండా టపాసుల శబ్ధాలతో వీదులన్నీ మోతమోగిపోతుంటాయి. రకరకాల టపాసులు కాల్చుతూ ఆనందంగా జరుపుకుంటారు. అయితే టపాసులు కాల్చి ప్రమాదంలో పడిన వారు కూడా ఉన్నారు. కళ్లకు, ఒంటిపై, కాళ్లకు, చేతులకు గాయాలై ఆసుపత్రుల్లో చేరిన వారు ఉన్నారు. టపాసులు పేలి అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు మృత్యువాత పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా కొందరు ఆకతాయిలు టపాసులను ఇళ్ళపైకి విసరడం, రద్దీగా ఉండే రోడ్లపైకి విసరడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ప్రమాదం వీటికి భిన్నం. ఆశకు పోతే చివరకు ప్రాణమే పోయింది. కొందరు ఆకతాయిలు ఓ వ్యక్తికి ఆటో కొనిస్తామని ఆశపెట్టి అతడి మృతికి కారణమయ్యారు. బాంబులు పెట్టిన డబ్బాపై కూర్చుంటే ఆటో కొనిస్తామని ఆశపెట్టారు. అధిక మొత్తంలో బాంబులు పేలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషాద ఘటన బెంగళూరు – కోననకుంటెలో చోటుచేసుకుంది. దీనికి సంబందించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లో.. కోననకుంటెలో దీపావళి సందర్భంగా కొందరు యువకులు టపాసులు కాల్చుతున్నారు. అయితే అక్కడే ఉన్న శబరీష్ అనే వ్యక్తిని బాంబులు పెట్టిన డబ్బాపై కూర్చుంటే ఆటో కొనిస్తామని ఆశచూపారు.

డబ్బాపై కూర్చుంటే ఏమౌతదిలే.. కొత్త ఆటో వస్తది కదా అనుకున్నాడు. కానీ అతడి ఆశ ఆయువు తీస్తదని ఊహించలేదు. ఆకతాయిలు చెప్పినట్టు విని శబరీష్ ఆ డబ్బాపై కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ ఆకతాయిలు అందరూ దూరంగా వెళ్లారు. ఆ సమయంలో శబరీష్ కూర్చున్న డబ్బా కింద ఉన్న బాంబులు భారీ శబ్ధంతో పేలాయి. అధిక మొత్తంలో బాంబులు పేలడంతో శబరీష్ అక్కడే కిందపడిపోయాడు. పేలుడు ధాటికి అతడు గాయపడ్డాడు. ఈ ఘటనలో శబరీష్ అక్కడికక్కడే మరణించాడు. ఆటో కోసం ఆశపడి బాంబులు పెట్టిన డబ్బాపై కూర్చుని ఆఖరికి ప్రాణాలు వదిలాడు. ఈ ఊహించని ఘటనతో ఆకతాయిలు ఒక్కసారిగా వణికిపోయారు.

ఏదో సరదా కోసం చేస్తే ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలు పోవడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. ఈ దృష్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీన్ని చూసిన నెటిజన్లు ఆకతాయిలపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ప్రాంక్ చేస్తూ ప్రాణాలు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం అని తెలిసి కూడా ఓ వ్యక్తి ప్రాణాలు తీశారంటూ ఫైర్ అవుతున్నారు. ఆటో కొనిస్తామని ఆశపెట్టి ప్రాణాలు తీయడంతో వారిపై మండిపడుతున్నారు. మరి ఆటో కోసం ఆశపడి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments