iDreamPost
android-app
ios-app

అందమైన భార్యపై భర్తకు అనుమానం! అర్థరాత్రి అందరూ నిద్రపోయాక..!

  • Published Sep 14, 2023 | 4:29 PM Updated Updated Sep 14, 2023 | 4:29 PM
  • Published Sep 14, 2023 | 4:29 PMUpdated Sep 14, 2023 | 4:29 PM
అందమైన భార్యపై భర్తకు అనుమానం! అర్థరాత్రి అందరూ నిద్రపోయాక..!

అందమైన అమ్మాయి భార్యగా రావాలని ప్రతీ యువకుడు కోరుకుంటాడు. మొత్తానికి ఏరి కోరి మరీ ఓ అందమైన యువతిని వివాహం చేసుకుంటారు. చేసుకున్నాక ఆమెతో సాఫీగానే సంసారం చేస్తున్నారా అంటే అదీ లేదు. ప్రతీ దానికి ఆమెతో గొడవ పడుతుంటారు. ఇక మరీ ముఖ్యంగా భార్య అందంగా ఉందని ఆమెపై అనుమానం పెంచుకోవడం చేస్తుంటారు. ఇంతే కాకుండా ఆమెను తరుచు వేధిస్తూ చివరికి హత్యలు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే చూశాం. ఇదిలా ఉంటే.. ఓ భర్త మాత్రం.. భార్య అందంగా ఉందని ఆమెపై అనుమానం పెంచుకుని చివరికి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాసిక్ అద్గావ్ పరిధిలోని తుల్జాభవాని ప్రాంతం. ఇక్కడే విశాల్ ఘోర్పడే-ధనశ్రీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే పెళ్లైన నాటి నుంచి భర్త విశాల్ భార్య ధనశ్రీను తరుచు అనుమానిస్తు ఉండేవాడు. నా భార్య పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని భావించేవాడు. ఇదే కాక.. ఈ విషయంపై భర్త భార్యను చాలా సార్లు నిలదీయడంతో గొడవలు కూడా జరిగాయి. అలా వారానికోసారి విశాల్ భార్యతో గొడవ చేస్తూనే ఉండేవాడు.

అయితే విశాల్ ఇటీవల ఓ రోజు రాత్రి భార్య ధనశ్రీతో మరోసారి గొడవ పడ్డారు. ధనశ్రీ పాత్రపై అనుమానం పెంచుకున్న భర్త.. ఎలాగైన ఆమెను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ రోజు అర్థరాత్రి అందరూ పడుకున్నాక ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంట్లో తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కట్ చేస్తే.. వీరి కుమారుడు తెల్లవారుజామున కళ్లు తెరిచి చూసేసరికి తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో శవాలుగా కనిపించారు. ఈ సీన్ చూసి ఆ బాలుడు షాక్ గురై గుండెలు పగిలేలా ఏడ్చాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom