iDreamPost
android-app
ios-app

దారుణం: భార్య నిండు గర్భిణీ అని కూడా చూడకుండా..!

దారుణం: భార్య నిండు గర్భిణీ అని కూడా చూడకుండా..!

మహారాష్ట్రలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ ఆర్మీ జవాన్ తన భార్యపై కిరాతకానికి ఒడిగట్టాడు. ఆమె నిండు గర్భిణీ అన్న సోయి కూడా లేకుండా చేయాల్సిందంతా చేశాడు. ఇంతే కాకుండా తన కూతురిపై కూడా దారుణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కంధర్ పరిధిలోని బోరి గ్రామం. ఇదే ఊరికి చెందిన ఏక్ నాథ్ జయభయే అనే వ్యక్తి ఆర్మీ జవాన్ గా సేవలు అందిస్తున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. ఏక్ నాథ్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి తన భార్య, కూతురితో గడిపి తిరిగి వెళ్లిపోయేవాడు. అలా కొంత కాలం పాటు వీరి సంసారం బాగానే నడిచింది. అయితే ఏం జరిగిందో ఏం తెలియదు కానీ.. గత కొంత కాలం నుంచి ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు.

క్షణికావేశంలో ఊగిపోయిన భర్త ఏక్ నాథ్.. భార్య నిండు గర్భిణీ అన్న సోయి మరిచి కత్తితో గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశాడు. ఇంతే కాకుండా తన కూతురిని సైతం ప్రాణాలతో లేకుండా చేశాడు. అనంతరం నిందితుడు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని భార్య, కూతురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ప్లాట్ కొనుగోలు విషయంలో దంపతుల మధ్య వివాదం రాజుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. క్షణికావేశంలో గర్భిణీ భార్యను, కూతురిని అతి దారుణంగా హత్య చేసిన ఈ దుర్మార్గుడి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetjojobet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetjojobet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş