iDreamPost
android-app
ios-app

భార్య, కుమారుడిపై భర్త కిరాతకం.. ఇంత దారుణం ఎలా చేశాడో..!

ఈమె పేరు అశ్విని. గతంలో దీపక్ కళ్యాణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొంత కాలానికి ఓ కుమారుడు జన్మించాడు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే అశ్విని భర్త దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?

ఈమె పేరు అశ్విని. గతంలో దీపక్ కళ్యాణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొంత కాలానికి ఓ కుమారుడు జన్మించాడు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే అశ్విని భర్త దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?

భార్య, కుమారుడిపై భర్త కిరాతకం.. ఇంత దారుణం ఎలా చేశాడో..!

ఈమెకు దీపక్ కళ్యాణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కొన్నాళ్లకి వీరికి కుమారుడు జన్మించాడు. ఇతడిని చూసుకుంటూ ఈ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉండేవారు. అయితే, దీపక్ కళ్యాణ్ కి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. అతడు వీటిని చూసుకుంటూ ఉండేవాడు. అయితే, అన్ని బాగానే ఉన్నాయనుకునే తరుణంలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇలా జరగడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. తాజాగా వెలుగు చేసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని రాంబాగ్ దీపాలయ భవనంలో దీపక్ కళ్యాణ్-అశ్విని (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి అధిరాజ్ (7) అనే కుమారుడు జన్మించాడు. అయితే, దీపక్ కళ్యాణ్ కు రెండు మూడు స్టేషనరీ షాపులతో పాటు ఒక నర్సరీ స్కూల్ ను నడిపిస్తున్నాడు. దీంతో అతడు 100 మంది ఉద్యోగులతో వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. కానీ, గత కొంత కాలం నుంచి దీపక్ కళ్యాణ్ అప్పుల్లో కూరుకుపోయినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగేవని తెలుస్తుంది. దీంతో దీపక్ కళ్యాణ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.

దీంతో ఇతడు మరోసారి భార్యతో గొడవకు దిగాడు. క్షణికావేశంలో ఊగిపోయిన దీపక్ కళ్యాణ్ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా తన భార్య అశ్వినితో పాటు కుమారుడు అధిరాజ్ ను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అప్రమత్తమైన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş