సింధు మృతిపై వీడని మిస్టరీ! అసలేం జరిగింది?

ఈ యువతి పేరు అజ్మీర సింధు. వయసు 19 ఏళ్లు. రెండేళ్ల కిందటే తండ్రి చనిపోవడంతో అప్పటి నుంచి తల్లి వద్దే ఉంటూ చదువుకుంది. ఇదిలా ఉంటే.. ఈ యువతి గత కొంత కాలం నుంచి స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ ఉండేది. అయితే, ఈ యువతి ఉన్నట్టుండి తాజాగా అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సింధు మరణంపై గ్రామస్తులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికీ ఆమె మరణంపై మిస్టరీ విడింది లేదు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా ఇల్లందు మండలం పరిధిలోని పోలంపల్లి రాజీవ్ నగర్ తండాలో అజ్మీర సింధు (19) అనే యువతి నివాసం ఉంటుంది. ఆమె తండ్రి గత రెండేళ్ల కిందటే చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి ఆమె తల్లి వద్దే ఉంటూ చదువుకుంది. ఇదిలా ఉంటే.. సింధు గత కొన్ని రోజుల నుంచి మహబూబాబాద్ లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ ఉండేది. ఇకపోతే.. సోమవారం ఉన్నట్టుండి ఇంట్లో సింధు శవమై కనిపించింది. విషయం ఏంటంటే? ఆ రోజు సింధు, ఆమె సోదరుడు హరిలాల్ ఇద్దరూ గొడవపడ్డట్లు తెలుస్తుంది.

దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారని, ఇదే కోపంతో హరిలాల్ ఆమెపై రోకలి బండతో దాడి చేయడంతో ఆమె చనిపోయిందని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. మరి కొందరు మాత్రం.. వరుసగా కురుస్తున్న వర్షాలకు వాని ఇంటిపై నుంచి రాయి పడి సింధు చనిపోయిందని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతే అసలు నిజాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో దారుణం.. భార్యను చంపి భర్త ఏం చేశాడో తెలుసా?

Show comments