iDreamPost

పెళ్లి చేసుకోవాలన్న పేరెంట్స్, ఇష్టం లేదన్న కూతురు.. తర్వాత జరిగింది ఇదే!

ఈ యువతి పేరు వర్ష. ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. అయితే ఈమెకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడే చేసుకోవం ఇష్టం లేదు. తల్లిదండ్రులు బలవంతం పెట్టడంతో ఈ యువతి ఏం చేసిందో తెలుసా?

ఈ యువతి పేరు వర్ష. ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. అయితే ఈమెకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడే చేసుకోవం ఇష్టం లేదు. తల్లిదండ్రులు బలవంతం పెట్టడంతో ఈ యువతి ఏం చేసిందో తెలుసా?

పెళ్లి చేసుకోవాలన్న పేరెంట్స్, ఇష్టం లేదన్న కూతురు.. తర్వాత జరిగింది ఇదే!

హిందూ సాంప్రదాయం ప్రకారం ఓ యువకుడు పెద్దల సమక్షంలో ఇష్టపూర్వకంగా యువతికి తాళికట్టి ఆ తర్వాత ఇద్దరు ఏడడుగులు నడవడం ద్వారా సమాజంలో దంపతులుగా గుర్తించబడతారు. కానీ, కొందరు యువతి, యువకులు మాత్రం.. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. వీరిని చూసి కొందరు పెళ్లి చేసుకుంటేనే బాగుపడ్డట్లు అన్నట్లుగా లెక్చర్స్ ఇస్తూ పెళ్లికాని ప్రసాదులు అంటూ అందరి ముందు హేళన చేస్తుంటారు. ఇక ఇంట్లో పిల్లలు పెరిగి పెద్దవారై వయసుకు రాగానే వారికి తల్లిదండ్రులు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటుంటారు. అయితే, అచ్చం ఇలాగే ఓ దంపతులు చదువుకుంటున్న తమ కూతురికి పెళ్లి చేయాలని భావించారు. కానీ, ఆ యువతికి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను చదువుకోవాలని, అప్పుడే వివాహం చేసుకోనని తెగేసి చెప్పింది. కానీ, ఆ తర్వాత జరిగింది తెలిసి అంత షాక్ గురయ్యారు. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా హసన్ పర్తి పరిధిలోని ఓ ప్రాంతంలో అశోక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి వర్ష (21) అనే కూతురు ఉంది. ప్రస్తుతం ఈ యువతి ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఇక కూతురు పెళ్లి వయసుకు రావడంతో అశోక్ పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని ఇటీవల కూతురికి కూడా చెప్పాడు. కానీ, వర్ష మాత్రం.. నేను ఇంకా చదువుకోవాలని, ఇప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పింది. అయినా వినని ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. అప్పటి నుంచి వర్ష ఏమనుకుందో ఏమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు లేని సమయం చూసి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని కూతురుని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, పరిస్థితి విషమించడంతో వర్ష చికిత్స పొందుతూ అదే రోజు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము మా కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నామని, అది ఇష్టం లేకే వర్ష ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కొందరు మానసిక నిపుణులు స్పందించారు. పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు బలవంతం పడితే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని. కానీ, ఇలా కాకుండా ఆత్మహత్య చేసుకోవద్దంటూ సూచనలు చేస్తున్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్న ఈ యువతి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి