iDreamPost

ట్రాన్స్‌జెండర్ వేధింపులు.. యువకుడు చేసిన పనికి అంతా షాక్!

ట్రాన్స్‌జెండర్ వేధింపులు.. యువకుడు చేసిన పనికి అంతా షాక్!

మహబూబాబాద్ జిల్లా గూడురులోని కోమటిపల్లి తండాలో ధరావత్ శివరాం (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.అయితే ఇతనికి గతంలో తపస్వీ అనే ఓ ట్రాన్స్ జెండర్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం.. గతంలో ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. అలా కొంత కాలం పాటు ఇద్దరు కలిసున్నారు. అయితే రాను రాను ఇద్దరి మధ్య కాస్త విభేదాలు భగ్గుమన్నాయి.

దీంతో అప్పటి నుంచి శివరాం తపస్వీతో విడిపోయాడు. ఆ తర్వాత ఈ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలోనే తపస్వీ ప్రియుడు శివరాంను బెదిరిస్తూ వేధింపులకు దిగింది. ఇక తట్టుకోలేకపోయిన శివరాం మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: చిత్తూరు వాసికి ఉరి శిక్ష! ఎంతటి పాపం చేశాడో తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి