iDreamPost
android-app
ios-app

మియాపూర్ లో పోలీసులపై రాళ్ల దాడి.. HMDA స్థలాలు ఖాళీ చేయిస్తుండగా ఘటన!

Madhapur DCP Vineeth About Miyapur HMDA Lands Issue: మియాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. హెచ్ఎండీఏ స్థలాలు ఆక్రమించేందుకు వచ్చిన ప్రజలను ఖాళీ చేయించే క్రమంలో కొందరు పోలీసుపై రాళ్లు రువ్వారు. అక్కడి పరిస్థితిపై మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు.

Madhapur DCP Vineeth About Miyapur HMDA Lands Issue: మియాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. హెచ్ఎండీఏ స్థలాలు ఆక్రమించేందుకు వచ్చిన ప్రజలను ఖాళీ చేయించే క్రమంలో కొందరు పోలీసుపై రాళ్లు రువ్వారు. అక్కడి పరిస్థితిపై మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు.

మియాపూర్ లో పోలీసులపై రాళ్ల దాడి.. HMDA స్థలాలు ఖాళీ చేయిస్తుండగా ఘటన!

మియాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. 504 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గుడిసెలు వేసుకుని కూర్చున్నారు. గత రెండ్రోజుల నుంచి ఆ పరిసరాల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రజలు అలా ఆక్రమణలకు దిగడంపై HMDA అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చర్యలను ఉపేక్షిచేంది లేదు అని హెచ్చరించారు. అయితే అక్కడున్న ప్రజలను ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై ప్రజలు తిరగబడ్డారు. అక్కడ కూర్చున్న వారిలో కొందరు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. ఆ స్థలాల నుంచి పోలీసులు పరుగులు పెట్టారు. పెద్ద పెద్ద రాళ్లు రువ్వడంతో పోలీసులు వెనుతిరగక తప్పలేదు. ప్రస్తుతం పరిస్థితులు కంట్రోల్ ఉన్నాయి అంటూ మాదాపూర్ డీసీపీ వినీత్ స్పష్టం చేశారు.

గత రెండ్రోజులుగా మియాపూర్ HMT రోడ్డు సమీపంలోని హెచ్ఎండీఏ స్థలాలను ఆక్రమించేందుకు కొందరు ప్రజలు అక్కడకు చేరుకున్నారు. సర్వే నంబర్ 100, 101లో ఉన్న స్థలాలను ఆక్రమించేందుకు ప్రజలు ప్రయత్నించారు. ఎవరికి వాళ్లు ఇది మా స్థలం అంటూ హద్దులు పెట్టుకున్నారు. దీనంతటికీ కారణం.. వాట్సాప్ లో సర్క్యులేట్ అయిన ఒక వీడియో అని తెలుస్తోంది. ఎవరో కొందరు అక్కడి స్థలాలను ఆక్రమించుకోవచ్చు అని వీడియో షేర్ చేయగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితులను చక్కదిద్ది.. ఆ స్థలాలను ఖాళీ చేయించాలని చూసిన పోలీసులపై దాడికి దిగారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే పోలీసులు అక్కడున్న ప్రజలతో మాట్లాడారు. ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు అంటూ వారికి అర్థమయ్యేలా చెప్పారు. పోలీసులు చెప్పిన మాటలు కొందరు విని రావడం తప్పే అంటూ వెనుతిరిగి వెళ్లిపోయారని స్పష్టం చేశారు. వారిలో ఉన్న కొందరు లీడర్లతో కూడా పోలీసులు చర్చలు జరిపారు. అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని వారికి వాస్తవాన్ని వివరించారు. అయితే కొందరు మాత్రం పోలీసులు చెబుతున్న మాటలు వినడం లేదని మాదాపూర్ డీసీపీ వినీత్ వ్యాఖ్యానించారు. చెప్పిన మాట వినని వారిపై కచ్చితంగా కేసులు పెడతామని హెచ్చరించారు.

డీసీపీ వినీత్ మాట్లాడుతూ.. ” ఇక్కడ పీస్ ఫుల్ గా కొందరు కూర్చున్నారు. కొందరు మాత్రం పోలీసుల మీద రాళ్లు రువ్వారు. మేం మాటలతోనే చెప్తున్నాం. కొందరు వింటున్నారు.. కొందరు మాత్రం వినట్లేదు. రెవిన్యూ అధికారులు కూడా వచ్చారు. పరిస్థితి కంట్రోల్ లోనే ఉంది. ఇక్కడ కూర్చుంటాం అంటే అది కరెక్ట్ కాదు. వాళ్లు కావాలి అంటే సరైన విధానంలో పిటిషన్ వేసుకోవాలి. ఇది సరైన పద్ధతి కాదు. కొందరు మాత్రం ఐదారుగురు చెప్పిన మాటలు విని వచ్చారు. కొందరు వాలంటీరుగా వస్తున్నారు. కొందరు మాత్రం పొరపాటున వచ్చాం అని చెప్తున్నారు. మాట వినని వారిపై కేసులు కచ్చితంగా ఉంటాయి. వచ్చిన వారిలో పది పదిహేను మంది దాడి చేశారు. దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. దాడి చేసిన వారిపై కేసులు పెడతాం. ఇక్కడ ఉంటే వారికి అంతా కష్టమే. వారిని మాట్లాడి పంపిస్తాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో పెట్టేందుకు అవసరమైతే అదనపు బలగాలు తీసుకుంటాం” అంటూ మాదాపూర్ డీసీపీ వినీత్ స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి