iDreamPost
android-app
ios-app

పాపం హర్షిణ .. డెలివరీ కోసం ఆస్పత్రికి వెళితే..

ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులకు చాలా రకాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా, ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది.

ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులకు చాలా రకాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా, ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది.

పాపం హర్షిణ .. డెలివరీ కోసం ఆస్పత్రికి వెళితే..

వైద్యో నారాయణో హరి అంటారు. అంటే దేవుడి తర్వాత మనుషులకు ప్రాణం పోసే శక్తి వైద్యుడికి ఉంటుందని దాని అర్థం. అయితే, కొన్ని సార్లు కొంతమంది వైద్యులు.. వైద్య వృత్తికే కలంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందుల పాలవుతున్న రోగుల గురించి వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి. కొన్ని సార్లు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. తాజాగా, కేరళలో ఓ దారుణం చోటుచేసుకుంది.

డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు దారుణ అనుభవం ఎదురైంది. వైద్యులు ఆమె కడుపులో కత్తెర ఉంచి కుట్లేశారు. దీంతో ఆమె ఆరోగ్యం పరిస్థితి బాగా క్షీణించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. పోలీసులు ఛార్జ్‌ షీట్‌లో తెలిపిన వివరాల మేరకు.. కేరళలోని కోయికోడ్‌కు చెందిన హర్షిణ అనే ఓ మహిళ డెలివరీ కోసం కోయికోడ్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో చేరింది. హర్షిణకు ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులు డెలివరీ చేశారు.

డెలివరీ తర్వాత మహిళ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాతినుంచి ఆమె కడుపులో నొప్పి రావటం మొదలైంది. రోజులు గడుస్తున్నా నొప్పి తగ్గలేదు. నొప్పి తగ్గకపోవటంతో ఆమె దగ్గరలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లింది. ఆమె కడుపును ఎక్స్‌రే తీసిన వైద్యులు లోపల కత్తెర ఉన్నట్లు గుర్తించారు. కత్తెర కారణంగానే ఆమె కడుపులో నొప్పి వస్తున్నట్లు వెల్లడించారు. శస్త్ర చికిత్స చేసి కత్తెరను బయటకు తీశారు. హర్షిణ తన కుటుంబం సహాయంతో దీనిపై పోలీసులను ఆశ్రయించింది.

ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై కేసు పెట్టింది. హర్షిణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తప్పు ఏమీ లేదని తేలింది. తర్వాత జరిగిన దర్యాప్తులో.. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సుల తప్పు ఉన్నట్లు తేలింది. వారిపై కేసు పెట్టారు. తాజాగా, ఈ కేసుకు సంబంధించి పోలీసులు 750 పేజీల ఛార్జ్‌ షీటును కోర్టులో దాఖలు చేశారు. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగినట్లు కోర్టకు వెల్లడించారు.

ఇక, ఈ సంఘటన కేరళ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డెలివరీ కోసం వెళ్లిన మహిళ కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేయటాన్ని జనం తీవ్రంగా తప్పుబడుతున్నారు. వైద్యులు, నర్సులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి